భజరంగ్‌దళ్ కార్యకర్తల అరెస్ట్

వాలెంటైన్స్ డే సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని కండ్లకోయ ఆక్సిజన్ పార్కుకు వచ్చిన యువతి, యువకుడిని బెదిరించి బలవంతంగా పెళ్లి చేసిన యువకులు అడ్డంగా బుక్కయ్యారు. ఈ ఘటనలో ఆనంద్, అవినాష్,శ్రీహరిచారి,  సురేష్ కుమార్ ,అశోక్, చంద్రశేఖర్ అనే ఆరుగురు యువకులను గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమికుల రోజున బహిరంగంగా తిరిగితే అక్కడికక్కడే పెళ్లి చేసేస్తామంటూ భజరంగ్‌దళ్ లాంటి హిందుత్వ సంస్థలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం ఆక్సిజన్‌ పార్కులో ఓ జంట కనిపించగా […]

భజరంగ్‌దళ్ కార్యకర్తల అరెస్ట్
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 6:51 PM

వాలెంటైన్స్ డే సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని కండ్లకోయ ఆక్సిజన్ పార్కుకు వచ్చిన యువతి, యువకుడిని బెదిరించి బలవంతంగా పెళ్లి చేసిన యువకులు అడ్డంగా బుక్కయ్యారు. ఈ ఘటనలో ఆనంద్, అవినాష్,శ్రీహరిచారి,  సురేష్ కుమార్ ,అశోక్, చంద్రశేఖర్ అనే ఆరుగురు యువకులను గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమికుల రోజున బహిరంగంగా తిరిగితే అక్కడికక్కడే పెళ్లి చేసేస్తామంటూ భజరంగ్‌దళ్ లాంటి హిందుత్వ సంస్థలు హెచ్చరించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే గురువారం ఆక్సిజన్‌ పార్కులో ఓ జంట కనిపించగా కొంతమంది వారిని బెదిరించి యువతి మెడలో యువకుడితో తాళి కట్టించారు. ఈ పెళ్లిని ఫోన్‌లో రికార్డు చేసిన సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన అమ్మాయి తండ్రి జైపాల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  బాధిత బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేర తాము కే సు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశామని బాలానగర్ డీసీపీ పద్మజ చెప్పారు.