Hyderabad: తెలంగాణ వాసులకు అలర్ట్.. రానున్న మూడు రోజులు వానలే వానలు.. ఉరుములు, మెరుపులతో..

Hyderabad Weather Updates: కొద్ది రోజులుగా ఎండలతో మండిపోతున్న తెలంగాణను (Telangana) వరుణుడు పలకరించనున్నాడు. రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది...

Hyderabad: తెలంగాణ వాసులకు అలర్ట్.. రానున్న మూడు రోజులు వానలే వానలు.. ఉరుములు, మెరుపులతో..
Follow us

|

Updated on: Aug 27, 2022 | 7:16 PM

కొద్ది రోజులుగా ఎండలతో మండిపోతున్న తెలంగాణను (Telangana) వరుణుడు పలకరించనున్నాడు. రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులో కూడిన వర్షాలు కురుస్తాయని, చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని తెలిపింది. ఆదివారం, సోమవారాల్లో అనేకచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉత్తర – దక్షిణ ద్రోణి సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్లు ఎత్తున కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. వాన (Rains) లు కురిసే అవకాశం ఉన్నందున ఎవరూ బయటకు రావద్దని, అత్యవసరమైతేనే రావాలని సూచిస్తున్నారు. వాగులు, నదులు పొంగే అవకాశం ఉన్నందున పొలం పనులకు వెళ్లే వారు జాగ్రత్తులు పాటించాలని పేర్కొన్నారు. మరోవైపు.. ఉత్తర కర్ణాటక నుంచి కొమొరిన్ ప్రాంతం వరకు ఉన్న ద్రోణి ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు మీదుగా కొమొరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఉంది. దీంతో వచ్చే మూడు రోజులు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.

గురువారం ఉదయం 8 నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకూ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరిలో అత్యధికంగా 12.6, యాదాద్రి జిల్లా గుండాలలో 10.2, జోగులాంబ జిల్లా భీమవరంలో 8.9, వనపర్తి జిల్లా వీపనగండ్లలో 8.9, నల్గొండ జిల్లా పడమటిపల్లెలో 6.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో సాధారణంకన్నా 2 నుంచి 3 డిగ్రీలు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయి.

శని, ఆది వారాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములతో జల్లులు పడతాయి. ఈదురు గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. సోమవారం తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి. దక్షిణ కోస్తాలోనూ తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశముంది. రాయలసీమలో ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..