కోవిడ్ నుంచి కోలుకుంటున్నా: ఎమ్మెల్యే బాజిరెడ్డి

కరోనా నుంచి తాను కోలుకుంటున్నానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అన్నారు. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తాను తిరిగి వస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కోవిడ్ నుంచి కోలుకుంటున్నా: ఎమ్మెల్యే బాజిరెడ్డి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 18, 2020 | 2:45 PM

కరోనా నుంచి తాను కోలుకుంటున్నానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అన్నారు. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తాను తిరిగి వస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తన అనుచరులు, అభిమానులు ఎవరూ ఆందోళన చెందొద్దని ఆయన కోరారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసిన బాజిరెడ్డి.. నా గురించి ఎవరూ ఆందోళన చెందకండి. నేను, నా సతీమణి బాగానే ఉన్నాము. మా కుటుంబ సభ్యుల కోసం పూజలు చేస్తున్న కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు. మీ అందరి ఆశీస్సులతో ఆరోగ్యంగా తిరిగి వస్తా. నాకు ధైర్యం ఉంది అని అన్నారు. ఇక కరోనాకు కట్టడి వేసేందుకు అందరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని బాజిరెడ్డి పిలుపునిచ్చారు.

కాగా ఇటీవల జరిపిన పరీక్షల్లో బాజిరెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది. బాజిరెడ్డితో పాటు ఆయన భార్య, ఇంట్లో పనిమనిషి, గన్‌మెన్ డ్రైవర్‌కి కరోనా సోకింది. దీంతో బాజిరెడ్డి, ఆయన భార్యను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆయన త్వరలోనే ఇంటికి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read This Story Also: గురుకుల పాఠశాలల్లో.. లాటరీ పద్ధతిలో అడ్మిషన్లు..