ఇవాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్న హరీష్ రావు

రెండు రోజుల సెలవుల తరువాత ఈ రోజు ఉదయం 10 గంటలకు తెలంగాణ ఉభయ సభలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

  • Tv9 Telugu
  • Publish Date - 8:43 am, Mon, 14 September 20
ఇవాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్న హరీష్ రావు

Telangana Assembly Session: రెండు రోజుల సెలవుల తరువాత ఈ రోజు ఉదయం 10 గంటలకు తెలంగాణ ఉభయ సభలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ రోజు సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో సీఎం కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్బంగా తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్ -2020 ను మండలి ఆమోదం కోసం కేసీఆర్‌ చర్చకు పెట్టనున్నారు. ఇక మంత్రి హరీష్ రావు ఇవాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. కరోనా సోకడంతో చికిత్స తీసుకున్న ఆయన ఇటీవల కోలుకున్నారు. శనివారం జరిపిన పరీక్షల్లో ఆయనకు నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన అసెంబ్లీ సమావేశాలకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖకు సంబంధించిన బిల్లులను హరీష్ రావు సభలో ప్రవేశపెట్టనున్నారు.

మరోవైపు నేడు 8 కీలక బిల్లులు అసెంబ్లీలో చర్చకు రానున్నాయి. అందులో తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లు 2020, తెలంగాణ కోశ బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ బిల్లు 2020, తెలంగాణ ఉద్యోగుల పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ బిల్లు 2020, తెలంగాణ విపత్తు మరియు ప్రజా ఆరోగ్య పరిస్థితి బిల్లు 2020, తెలంగాణ న్యాయస్థానాల రుసుము మరియు దావాల మదింపు సవరణ బిల్లు 2020, తెలంగాణ వస్తు మరియు సేవల పన్ను సవరణ బిల్లు 2020, తెలంగాణ రాష్ట్ర భవన అనుమతి ఆమోదం మరియు స్వీయ ధృవీకరణ విధానం ( టి ఎస్- బి పాస్) బిల్లు 2020 , తెలంగాణ సివిల్ న్యాయస్థానాలు సవరణ బిల్లు 2020లు ఉన్నాయి.

Read More:

Bigg Boss 4: వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన సాయి కుమార్

గుడ్‌న్యూస్‌.. తగ్గిన మాస్క్, పీపీఈ కిట్‌ల ధరలు