Telangana: వదలని వానలు.. మరో మూడురోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు

వర్షాలతో తెలంగాణ (Telangana) తడిసి ముద్దవుతోంది. విరామం లేకుండా వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. శుక్ర, శనివారాల్లో హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో కురిసిన వానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు.....

Telangana: వదలని వానలు.. మరో మూడురోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
Rains
Follow us

|

Updated on: Jul 24, 2022 | 12:36 PM

వర్షాలతో తెలంగాణ (Telangana) తడిసి ముద్దవుతోంది. విరామం లేకుండా వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. శుక్ర, శనివారాల్లో హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో కురిసిన వానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు.. తెలంగాణలో వచ్చే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అంతే కాకుండా ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్‌ అలెర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని, హైదరాబాద్‌ (Hyderabad) పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. వాతావరణ మార్పుల కారణంగా అప్పటికప్పుడు మేఘాలు ఏర్పడి కొద్దిగంటల వ్యవధిలోనే కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆది, సోమవారాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిస్తాయని స్పష్టం చేసింది. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే సాధారణ వర్షపాతం కంటే అత్యధికంగా నమోదైంది.

రానున్న మూడు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి మరోసారి వరదల వచ్చే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు, ప్రజా ప్రతినిధులకు సూచించారు. తాజా వానలతో గోదావరి ప్రమాద హెచ్చరికలను దాటి ప్రవహించే ముప్పు ఉందని చెప్పారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి పరీక్షా సమయమని, కష్టకాలంలో ప్రజలను కాపాడుకునేందుకు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..