Kalady Sri Adi Shankara Madom: మాసిక సత్సంగానికి ఆహ్వానం.. అన్నదానానికి విరాళాల సేకరణ
శ్రీ ఆదిశంకరాచార్యులు అందించిన ఆధ్యాత్మిక జ్ఞానోదయం, సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి అంకితమైన పవిత్ర స్వర్గధామం శ్రీ ఆదిశంకర మఠం. ఆదిశంకరాచార్యులు మానవాళికి అందించిన ఆధ్యాత్మిక వారసత్వాన్ని సంరక్షిస్తూ వేద సంప్రదాయాన్ని ముందు తరాలకు వివిధ మార్గాల ద్వారా అందిస్తోంది ఆదిశంకర మఠం.

శ్రీ ఆదిశంకరాచార్యులు అందించిన ఆధ్యాత్మిక జ్ఞానోదయం, సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి అంకితమైన పవిత్ర స్వర్గధామం శ్రీ ఆదిశంకర మఠం. ఆదిశంకరాచార్యులు మానవాళికి అందించిన ఆధ్యాత్మిక వారసత్వాన్ని సంరక్షిస్తూ వేద సంప్రదాయాన్ని ముందు తరాలకు వివిధ మార్గాల ద్వారా అందిస్తోంది ఆదిశంకర మఠం. తెలంగాణాలోని సికింద్రాబాద్‌లో కోవ్కూర్ గ్రామం బొలారంలో ఉన్న కాలడి శ్రీ ఆదిశంకర మఠంలో ప్రతి నెలా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ నేపధ్యంలో ఫిబ్రవరి 9వ తేదీ ఆదివారం ‘మాసిక సత్సంగం’ పేరిట ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. గణపతి హోమం, గౌరీ పూజ- నామకరణం, భగవద్గీత పరిచయం(మాసిక సత్సంగం)తో పాటు దేవద్రవ్య అనే ప్రోడక్ట్ లాంచ్ కూడా ఉండనుంది. ఇక ఈ కార్యక్రమాలు ముగిసిన అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు విచ్చేసిన భక్తులకు అన్నదానం జరగనుంది.
ఈ మాసిక సత్సంగానికి అందరూ ఆహ్వానితులు కాగా.. అమృతమసి(మాసిక అన్నదాన యోజన) కోసం నగదు లేదా ఇతర రూపాలలో ఉదారమైన విరాళాలను అందజేయాలని ఆదిశంకర మఠం అధికారులు కోరుతున్నారు. ఇక అన్నదానానికి విరాళం అందజేసేవారు ఈ లింక్ క్లిక్ చేయండి. https://kaladyshankaramadomts.org/index.php/worldline/booking. ఏదైనా సహాయం కావాలంటే 8350903080కి ఫోన్ చేయవచ్చు అని ఆదిశంకరాచార్య మహాసంస్థానం పేర్కొంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి