Vasavi Group: వాసవి గ్రూప్‌ సంస్థపై ఐటీ దాడులు.. తెలుగు రాష్ట్రాల్లో 40 బృందాలతో తనిఖీలు..

వాసవి గ్రూప్‌ ప్రధాన కార్యాలయంతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.

Vasavi Group: వాసవి గ్రూప్‌ సంస్థపై ఐటీ దాడులు.. తెలుగు రాష్ట్రాల్లో 40 బృందాలతో తనిఖీలు..
It Raids
Follow us

|

Updated on: Aug 17, 2022 | 6:16 PM

IT Raids in Vasavi Group: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు కలకలం రేపాయి. వాసవి కన్‌స్ట్రక్షన్స్, వాసవి గ్రూప్ ఆఫ్ వెంచర్స్‌లలో బుధవారం ఏకకాలంలో ఐటీ దాడులు జరిగాయి. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని వాసవి గ్రూప్‌ ప్రధాన కార్యాలయంతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. 40కి పైగా ఐటీ బృందాలు 20 ప్రాంతాల్లో జరుగుతున్న తనిఖీల్లో పాల్గొన్నట్టు అధికారులు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ వ్యాప్తంగా వాసవి గ్రూపు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్ల ఇళ్లతోపాటు సంస్థ ప్రధాన కార్యాలయం, అనుబంధ కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ సోదాలు చేస్తోంది. వాసవి గ్రూప్‌ సంస్థ వస్తున్న ఆదాయానికి, ప్రభుత్వానికి చెల్లిస్తున్న ఆదాయపు పన్నుకు వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించి కేసు నమోదు చేసినట్లు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు వెల్లడించారు.

వాస్తవ ఆదాయం చూపడం లేదన్న ఆరోపణలపై ఐటీ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వాసవి గ్రూప్‌ సంస్థకు చెందిన విలువైన పత్రాలు, పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి.. టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..