Hyderabad: ఈరోజు రాత్రి 7 తర్వాత అందుబాటులోకి భారత్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌ ఆన్‌లైన్‌ టికెట్లు

HCA నిర్లక్ష్యంతో అభిమానం గాయపడింది. క్రికెట్‌ మ్యాచ్‌ టిక్కెట్ల కోసం వచ్చిన నలుగురు మహిళలు గాయపడ్డారు. 48 ఏళ్ల మహిళ సృహ తప్పి పడిపోయింది. దీంతో ఆమెను పోలీసులు పక్కకు తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అందించారు.

Hyderabad: ఈరోజు రాత్రి 7 తర్వాత అందుబాటులోకి భారత్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌ ఆన్‌లైన్‌ టికెట్లు
Ind Vs Aus Match
Follow us

|

Updated on: Sep 22, 2022 | 5:04 PM

Telangana: జింఖానా గ్రౌండ్‌(Gymkhana Ground)లో ఇండియా వెర్సస్ ఆసిస్ మ్యాచ్‌కు సంబంధించిన ఆఫ్‌లైన్‌ టికెట్ల విక్రయాలు కంప్లీట్ అయినట్లు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) తెలిపింది. అయితే, ఆన్‌లైన్‌ టికెట్లు ఈరోజు(గురువారం) రాత్రి 7 తర్వాత  Paytm యాప్, Paytm ఇన్‌సైడర్ యాప్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈనెల 25న ఈ మ్యాచ్ ఉప్పల్‌ స్టేడియంలో జరగనుంది. మ్యాచ్ రోజు స్టేడియంలోకి ప్రవేశించేందుకు ఫిజికల్ టిక్కెట్లు తప్పనిసరి. కాగా మ్యాచ్‌ను లైవ్‌లో చూడాలనే ఆరాటంతో.. టికెట్స్ దక్కించుకునేందు జింఖానా గ్రౌండ్‌కు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది.  హెచ్‌సీఏ వైఫల్యం. పోలీసుల నిర్లక్ష్యం. చివరకు అభిమానుల ప్రాణాల మీదకు తెచ్చింది. అర్ధరాత్రి నుంచి వేలాది మంది అభిమానుల వచ్చారు. లైన్‌ చూస్తే జింఖానా గ్రౌండ్‌ నుంచి ప్యారడైజ్‌ దాటింది. కానీ హెచ్‌సీఏ పెద్దలు మాత్రం పట్టించుకోలేదు. పోలీసులు కన్నెత్తి చూడలేదు. చివరకు ఇప్పుడు ప్రాణాల మీదకు తీసుకు వచ్చింది. ఆసుపత్రిలో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. అర్ధరాత్రి నుంచి వేలాది మంది అభిమానులు టికెట్ల కోసం క్యూ కట్టారు. లైన్‌ పెరిగిపోతోంది. కానీ హెచ్‌సీఏ నిర్వాహకులు రాలేదు. టికెట్ల అమ్మకాలు తీరా పదిన్నరకు మొదలుపెట్టారు. గేటు నుంచి ఒక్కసారి 20 మందిని మాత్రమే అనుమతించారు. స్లోగా టికెట్లు అమ్మకాలు సాగుతుండడంతో పాటు.. ఆన్‌లైన్‌ పేమెంట్స్‌కు అనుమతించకపోవడంతో అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. ఒక్కసారిగా గేటెక్కి లోపలికి తోసుకుపోయేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

అభిమానులు ఒక్కసారిగా తోసుకురావడంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. దీంతో గేటు దగ్గర తొక్కిసలాట జరిగింది. ఇందులో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ మహిళ సృహ కోల్పోవడంతో వెంటనే పోలీసులు సీపీఆర్‌ చేశారు. ఆమె సృహలోకి రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. వెంటనే ఆమెను యశోద ఆసుపత్రికి తరలించారు. జింఖానా గ్రౌండ్స్‌లో ఈమె స్వీపర్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

కోవిడ్ తర్వాత జరుగుతున్న ఈవెంట్ కనుక అభిమానులు మ్యాచ్ చూసేందుకు ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతున్నారని చెప్పారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. టికెట్లు 30 నుంచి 35వేలు మాత్రమే ఉంటే అభిమానులు లక్షల్లో ఉన్నారని చెప్పారు. టికెట్లను బ్లాక్‌లో అమ్మే దళారులపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

ఆసిస్‌తో మ్యాచ్ కోసం టీమ్ ఇండియా జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమి , జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..