దిశ సెగలుః బతికుండగానే..ఘాతుకం, బయటపడ్డ మరో నిజం !

దిశ సెగలుః బతికుండగానే..ఘాతుకం, బయటపడ్డ మరో నిజం !

దిశ సంఘటన సెగలు దేశవ్యాప్తంగా రగులుతూనే ఉన్నాయి. అమాయకమైన ఆడపిల్లపై దుండగులు జరిపిన దమనకాండలో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. దిశపై అత్యాచారానికి పాల్పడిన కామాంధులు ఆమెను అతిదారుణంగా హతమార్చారు. ముక్కు, నోరు అదిమి పట్టి ఊపిరాడకుండా చేశారని, ప్రాణం పోయిన తర్వాత నేరం బయటపడకుండా ఉండడం కోసం పెట్రోల్‌ పోసి తగలబెట్టారని అంతా అనుకున్నారు. కానీ, బాధితురాలిని బతికుండగానే దహనం చేశారనే మరో కఠోర వాస్తవం వెల్లడైంది. నలుగురు నిందితుల్లో ఒకడు జైల్లో కాపలాగా […]

Pardhasaradhi Peri

|

Dec 04, 2019 | 5:21 PM

దిశ సంఘటన సెగలు దేశవ్యాప్తంగా రగులుతూనే ఉన్నాయి. అమాయకమైన ఆడపిల్లపై దుండగులు జరిపిన దమనకాండలో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. దిశపై అత్యాచారానికి పాల్పడిన కామాంధులు ఆమెను అతిదారుణంగా హతమార్చారు. ముక్కు, నోరు అదిమి పట్టి ఊపిరాడకుండా చేశారని, ప్రాణం పోయిన తర్వాత నేరం బయటపడకుండా ఉండడం కోసం పెట్రోల్‌ పోసి తగలబెట్టారని అంతా అనుకున్నారు. కానీ, బాధితురాలిని బతికుండగానే దహనం చేశారనే మరో కఠోర వాస్తవం వెల్లడైంది. నలుగురు నిందితుల్లో ఒకడు జైల్లో కాపలాగా ఉన్న జవాను వద్ద ఈ వాస్తవాన్ని చెప్పినట్టుగా తెలుస్తోంది. కొందరు జవాన్లు వారితో మాట కలపగా ప్రధాన నిందితుడు ఆరిఫ్‌ ఏ మాత్రం భయం లేకుండా తాము చేసిన దుర్మార్గపు నిర్వాకాన్ని మొత్తం పూస గుచ్చినట్టు చెప్పాడట. దిశను బలవంతంగా కాళ్లు చేతులు పట్టుకుని లాక్కెళ్లామని, ఆమె పెద్దగా కేకలు వేస్తుంటే ఎవరైనా వింటారన్న భయంతో తమ వద్ద ఉన్న మద్యాన్ని బలవంతంగా ఆమె నోట్లో పోశామని, అప్పటికే తీవ్ర భయంతో ఉన్న ఆమె స్పృహ కోల్పోయిందని, అప్పుడే తనపై అత్యాచారం చేశామని ఆరిఫ్‌ చెప్పినట్టు జైలు సిబ్బందిలో ఒకరు తెలిపారు.. మద్యం తాగించడంతో పాటు అత్యంత క్రూరంగా ప్రవర్తించడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిందని, ఆ తర్వాత ఏం చేయాలో అర్థంకాని స్థితిలో ఆమెను పెట్రోల్‌ పోసి తగలబెడితే మేము తప్పించుకోవచ్చు అనుకోని తగులబెట్టామని చెప్పాడట. దిశ కేసులో నలుగురు మృగాళ్లను ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉంచారు. జైలు చుట్టుపక్కల ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. మహానది బ్యారక్‌లో ఒక్కొక్కరిని ఒక్కో సెల్‌లో ఉంచారు. ఏ ఇద్దరూ మాట్లాడుకోకుండా పక్కాగా ప్రణాళిక చేశారు జైలు సిబ్బంది. వారి ఆరోగ్య పరిస్థితులను గంటకోసారి సమీక్షిస్తున్నారు. వేరే ఖైదీలెవరూ వారిపై దాడులకు యత్నించకుండా, వారిని కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సీసీ కెమెరాల ద్వారా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితి పరిశీలిస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu