Hyderabad: అందుబాటులోకి రానున్న మరో ఫ్లైఓవర్ బ్రిడ్జి.. తగ్గనున్న భాగ్యనగరవాసుల ట్రాఫిక్ కష్టాలు..

దేశంలో మెట్రో పాలిటీ నగరాల కంటే గ్రేటర్ హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్నందున.. దేశమే కాదు, ప్రపంచమే హైదరాబాద్ నగరం వైపు చూస్తోందని జీహెచ్ఎంసీ తెలిపింది.. అందుకు గల కారణం రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు అనుసరిస్తున్న సరళీకృత విధానాలు

Hyderabad: అందుబాటులోకి రానున్న మరో ఫ్లైఓవర్ బ్రిడ్జి.. తగ్గనున్న భాగ్యనగరవాసుల ట్రాఫిక్ కష్టాలు..
Hyderabad Shilpa Layout
Follow us

|

Updated on: Nov 07, 2022 | 7:20 PM

గ్రేటర్ హైదరాబాద్ నగరం రోజురోజుకు విస్తరిస్తోంది.. అందుకు తగ్గట్టుగా వాహనాలు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ విశేష కృషి చేస్తోంది. ఈ క్రమంలో భాగ్యనగరంలో మరో ఫ్లై ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. త్వరలో గచ్చిబౌలిలోని శిల్ప లే అవుట్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని ప్రారంభించనున్నట్లు జీహెచ్ఎంసీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి ఓఆర్‌ఆర్ వరకు నాలుగు లేన్లలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును జీహెచ్‌ఎంసీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనులు పూర్తిచేసింది. దీనిని ఈ నెలఖరు నాటికి ప్రారంభించేందుకు అధికారులు సన్నాకాలు చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి, మైండ్‌స్పేస్ జంక్షన్, హైటెక్ సిటీలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది.

దేశంలో మెట్రో పాలిటీ నగరాల కంటే గ్రేటర్ హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్నందున.. దేశమే కాదు, ప్రపంచమే హైదరాబాద్ నగరం వైపు చూస్తోందని జీహెచ్ఎంసీ తెలిపింది.. అందుకు గల కారణం రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు అనుసరిస్తున్న సరళీకృత విధానాలు, జిహెచ్ఎంసి ప్రజల అవసరాలను ముందుగా అంచనా వేసి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే కారణమని అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రవాణా సౌకర్యం, వాహన కాలుష్యాన్ని తగ్గించడం, సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తోంది. దీనికోసం స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ (SRDP) ప్రోగ్రామ్ ద్వారా చేపట్టిన పలు పనులు ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్నాయని.. దీంతో ప్రజల ఇబ్బందులు తొలగిపోతున్నాయని జీహెచ్ఎంసీ పేర్కొంది.

రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముందుచూపుతో గ్రేటర్ హైదరాబాద్ ను విశ్వ నగరంగా అభివృద్ధి చేసి మెరుగైన రవాణా వ్యవస్థను పటిష్టం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. ఐటీ పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన హైదరాబాద్‌లో గచ్చిబౌలి, మాదాపూర్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో గణనీయమైన అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆ ప్రాంత రవాణా వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు ఎస్.ఆర్.డి.పి ద్వారా కారిడార్లు, గ్రేడ్ సెపరేట్, అండర్ పాస్ లు, ఆర్ఓబి లు లాంటి రోడ్డు మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు ఔటర్ రింగు రోడ్డు ద్వారా గచ్చిబౌలి వరకు ఎలాంటి సమస్యలు లేకుండా నేరుగా చేరుకుంటున్నారు. అయినప్పటికీ.. అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు సులభతరంగా వెళ్లేందుకు ముఖ్యంగా శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం వలన ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా వెళ్లేందుకు సులభతరం కానుంది. జూబ్లీహిల్స్, పంజాగుట్ట నుంచి గచ్చిబౌలి మీదుగా పఠాన్ చేరు, కోకాపేట్, నార్సింగ్ తో పాటుగా అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లేందుకు ఒక మార్గం.. అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్, పంజాగుట్ట, కూకట్ పల్లి, మాదాపూర్ ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు గచ్చిబౌలి ఓ.ఆర్.ఆర్ నుంచి గ్రేడ్ సపరేట్ మరొక ఫ్లై ఓవర్ బ్రిడ్జిని చేపట్టారు. ఈ రెండు వైపులా అప్ అండ్ డౌన్ రెండు ఫ్లై ఓవర్లు నవంబర్ చివరి వారంలో అందుబాటులోకి రానున్నది.

ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన 17వ ఫ్లైఓవర్..

ఓ.ఆర్.ఆర్ నుంచి గతంలో ఉన్న గచ్చిబౌలి ఫ్లైఓవర్ పై నుండి శిల్పా లే ఔట్ వరకు అక్కడ నుండి ఓ.ఆర్.ఆర్ వరకు మరో వైపు రెండు వైపులా కలుపుకుని మొత్తం 956 మీటర్ల పొడవు 16.60 మీటర్ల వెడల్పు గల ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టారు. అప్ ర్యాంపు ఓ.ఆర్.ఆర్ నుంచి శిల్పా లే అవుట్ ఫ్లైఓవర్ వరకు 456.64 మీటర్ల వెడల్పు, శిల్పా లే అవుట్ నుంచి ఓ.ఆర్.ఆర్ వరకు డౌన్ ర్యాంపు ఫ్లై ఓవర్ 399.952 మీటర్ల వెడల్పుతో రెండు ఫ్లైఓవర్లను చేపట్టారు. సర్వీస్ రోడ్డుగా ఉపయోగించే గచ్చిబౌలి నుంచి మైండ్ స్పేస్ వరకు 473 మీటర్ల పొడవు 8.50 మీటర్ల వెడల్పుతో అప్ ర్యాంపు ఫ్లైఓవర్ ను చేపట్టారు. అదే విధంగా మైండ్ స్పేస్ నుండి గచ్చిబౌలి వరకు డౌన్ ర్యాంపు ఫ్లై ఓవర్ 522 మీటర్ల పొడవు 8.50 మీటర్ల వెడల్పుతో చేపట్టారు.

మెరుగైన కనెక్టవిటీ..

ఈ శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ వలన ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, హై టెక్ సిటీ మధ్య రోడ్ కనెక్టివిటీ పెరుగుతుంది. గచ్చిబౌలి జంక్షన్ ట్రాఫిక్ కు సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. హెచ్.కె.సి, మీనాక్షి టవర్ ప్రాంతంలో అభివృద్ధి పెరిగే అవకాశం ఉంటుంది. ప్రాజెక్టు స్టేజి 2లో భాగంగా ఓ.ఆర్.ఆర్ నుంచి కొండాపూర్ వరకు 816 మీటర్ల పొడవు 24 మీటర్ల వెడల్పుతో చేపట్టే ఇంకొక ప్రాజెక్టు పనులు కూడా కొనసాగుతున్నాయి. పాత గచ్చిబౌలి ఫ్లైఓవర్ కు ఆనుకొని అప్ ర్యాంపు కొండాపూర్ వైపు 475 మీటర్ల పొడవు 12 మీటర్ల వెడల్పు ఫ్లై ఓవర్, కొండాపూర్ నుండి గచ్చిబౌలి డౌన్ ర్యాంపు 305 మీటర్ల పొడవు 12 మీటర్ల వెడల్పుతో ఫ్లైఓవర్ నిర్మాణం వలన ట్రాఫిక్ సమస్య చాలా వరకు మెరుగు పడుతుంది. ఈ కొండాపూర్ ఫ్లై ఓవర్ 2023 సంవత్సరం జూలై వరకు పూర్తి చేయనున్నారు. ఎస్.ఆర్.డి.పి ద్వారా హైదరాబాద్ నలువైపులా చేపట్టిన పనులు ఒక్కొక్కటి అందుబాటులోకి రావడం మూలంగా ప్రజలకు రవాణా వ్యవస్థ మరింత మెరుగు పడుతుందని చెప్పవచ్చు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

సొంతంగా ఐటీఆర్ దాఖలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి
సొంతంగా ఐటీఆర్ దాఖలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి
థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా..? రోజూ ఈ డ్రింక్స్ తాగి చూడండి.
థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా..? రోజూ ఈ డ్రింక్స్ తాగి చూడండి.
'ఏపీలో వైసీపీ అధికారంలోకి రాబోతుంది'.. సజ్జల రామకృష్ణా రెడ్డి..
'ఏపీలో వైసీపీ అధికారంలోకి రాబోతుంది'.. సజ్జల రామకృష్ణా రెడ్డి..
పవన్ మేనరిజంతో బన్నీ, మహేశ్ డైలాగులు.. SRH కెప్టెన్ అదరగొట్టాడుగా
పవన్ మేనరిజంతో బన్నీ, మహేశ్ డైలాగులు.. SRH కెప్టెన్ అదరగొట్టాడుగా
అది నా పిల్ల రా..! భార్యను ఫోటోలు తీస్తున్నారని ఫైర్ అయిన హీరో..
అది నా పిల్ల రా..! భార్యను ఫోటోలు తీస్తున్నారని ఫైర్ అయిన హీరో..
మీ ఐ ఫోకస్ ఏ రేంజ్‌ది.? సెకన్లలో పామును కనిపెడితే మీరే ఇస్మార్ట్!
మీ ఐ ఫోకస్ ఏ రేంజ్‌ది.? సెకన్లలో పామును కనిపెడితే మీరే ఇస్మార్ట్!
గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. డేటా చోరీ జరుగుతోందంటూ..
గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. డేటా చోరీ జరుగుతోందంటూ..
పవర్‌ ఫుల్‌ డ్యాన్స్‌తో అదరగొట్టిన పోలీస్‌ బాస్‌... వీడియో చూస్తే
పవర్‌ ఫుల్‌ డ్యాన్స్‌తో అదరగొట్టిన పోలీస్‌ బాస్‌... వీడియో చూస్తే
'కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది'..
'కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది'..
రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే.. ఇక ఏ మందుల అవసరం ఉండదు..
రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే.. ఇక ఏ మందుల అవసరం ఉండదు..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా.! అప్పుడు చూస్తా.. : విశాల్.
రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా.! అప్పుడు చూస్తా.. : విశాల్.
బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరంటే..
బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరంటే..
క్వీన్ ఆఫ్ బ్యూటీ.. ఇప్పుడు మాస్ గా.. చూస్తే దిమ్మతిరిగాల్సిందే.!
క్వీన్ ఆఫ్ బ్యూటీ.. ఇప్పుడు మాస్ గా.. చూస్తే దిమ్మతిరిగాల్సిందే.!
వారి మాటలు నమ్మి ఆ తప్పులు చేశాను.. పరిణితి ఆసక్తికర వ్యాఖ్యలు.
వారి మాటలు నమ్మి ఆ తప్పులు చేశాను.. పరిణితి ఆసక్తికర వ్యాఖ్యలు.