సత్ప్రవర్తన.. 31 మంది రౌడీ షీటర్లకు విముక్తి

హైదరాబాద్‌ పాతబస్తీ సౌత్‌ జోన్‌ పరిధిలోని సాలార్ జుంగ్‌ మ్యూజియంలో సత్ప్రవర్తన కలిగిన రౌడీ షీటర్ల మేళాను పోలీసులు ఏర్పాటు చేశారు.

సత్ప్రవర్తన.. 31 మంది రౌడీ షీటర్లకు విముక్తి

Hyderabad Police Commissioner: హైదరాబాద్‌ పాతబస్తీ సౌత్‌ జోన్‌ పరిధిలోని సాలార్ జుంగ్‌ మ్యూజియంలో సత్ప్రవర్తన కలిగిన రౌడీ షీటర్ల మేళాను పోలీసులు ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా పాతబస్తీలో సత్ప్రవర్తన కలిగి, నేరాలకు దూరంగా ఉన్న 31 మంది రౌడీ షీటర్‌లకు విముక్తి కలిగించారు. పోలీస్ రికార్డుల్లో వారిని రౌడీ షీట్‌ని తొలగించినట్లు పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”31 మందికి కొత్త జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు అవకాశం కలిపించాము. వీరంతా గతంలో తప్పులు చేసి, నేరాలు చేసి జైల్‌కి వెళ్లారు. కానీ ఇప్పుడు వీరికి ఒక అవకాశం ఇచ్చాము. వీరందరూ ఆదర్శంగా ఉండి కుటుంబంతో సంతోషంగా జీవించి, సాధారణ పౌరులుగా ఉండాలని కోరుతున్నా. భవిష్యత్‌లో వీరు ఎలాంటీ నేరాలు చేసినా, లా అండ్ ఆర్డర్‌కి విఘాతం కలిగించినా తిరిగి జైలుకు పంపిస్తాం” అని అన్నారు.

Read This Story Also: తెరుచుకోనున్న యోగా సెంటర్లు, జిమ్‌లు.. తాజా మార్గదర్శకాలివే

Click on your DTH Provider to Add TV9 Telugu