Telangana: ఈ నెల 28 వరకు వానలే వానలు.. హైదరాబాద్ లో దంచికొట్టిన వాన

ఈ నెల 28 వరకు తెలంగాణ(Telangana) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు(శనివారం) హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే...

Telangana: ఈ నెల 28 వరకు వానలే వానలు.. హైదరాబాద్ లో దంచికొట్టిన వాన
Rains
Follow us

|

Updated on: Jun 25, 2022 | 7:37 AM

ఈ నెల 28 వరకు తెలంగాణ(Telangana) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు(శనివారం) హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయని వాటి ప్రభావంతో రాష్ట్రంలో వానలు పడుతోందని చెప్పారు. గడిచిన 48 గంటల్లో 21 జిల్లాల్లో వర్షం కురిసింది. ఆదిలాబాద్‌, కామారెడ్డి, నిర్మల్‌, జగిత్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షపాతం నమోదైంది. కాగా.. శుక్రవారం రాత్రి హైదరాబాద్(Hyderabad) లో భారీ వర్షం కురిసింది. కూకట్ పల్లి, మియాపూర్, బాలానగర్, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మెహదీపట్నం, అల్వాల్, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వానలతో జీహెచ్ఎంసీ అలర్టయ్యింది. సహాయం కోసం DRF టోల్ నెంబర్ 040-29555500 నెంబర్ కి కాల్ చేయాలనీ సూచించింది.

హైదరాబాద్ లో భారీ వర్షపాతం నమోదవ్వొచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో మాన్సూన్ యాక్షన్ టీమ్స్‌ను నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అప్రమత్తం చేశారు. వర్షాలు కురుస్తున్న పలు ప్రాంతంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరం అయితే గానీ బయటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ వార్తల కోసం..