Hyderabad: కి’లేడీ’.. ప్రైవేట్ వీడియోలు బయట పెడతానన్నాడని.. ప్రియుడి ప్రాణాలే తీయించింది..

Hyderabad: కి'లేడీ'.. ప్రైవేట్ వీడియోలు బయట పెడతానన్నాడని.. ప్రియుడి ప్రాణాలే తీయించింది..
Killer

ఓ వివాహితతో ప్రేమ, పెళ్లి కోసం కోసం బలవంతం చివరికి ఓ యువడికి హత్యకు దారితీసింది. ఆ హత్య చేయించింది కూడా ఎవరో కాదు.. సదరు ప్రేయసే.

Ram Naramaneni

|

May 12, 2022 | 6:58 PM

ఆమెకు పెళ్లైంది, కానీ పక్కదారి పట్టింది, ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలియకుండా ప్రియుడితో కలిసి తిరిగింది. ఆ వివాహేతర సంబంధం చివరికి మర్డర్‌కు దారి తీసింది. హైదరాబాద్‌ మీర్‌పేట్‌లో ఈ ఇన్సిడెంట్‌ జరిగింది. మీర్‌పేట్‌ ప్రశాంతి హిల్స్‌లో ఉండే శ్వేతారెడ్డికి బాగ్‌అంబర్‌పేట్‌లో ఉండే యశ్విన్‌… ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య చనువు పెరిగి, అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే, కొద్దిరోజులుగా యశ్విన్‌ వేధింపులకు దిగాడు. ఏకాంతంగా ఉన్నప్పుడు తీసిన వీడియోలు, ఫొటోలతో బ్లాక్‌ మెయిల్‌ చేయడం మొదలుపెట్టాడు. తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే న్యూడ్ వీడియోలు, ఫొటోలను బయటపెడతానంటూ బెదిరింపులకు దిగడంతో స్నేహితులతో కలిసి యశ్విన్‌ను మర్డర్‌ చేయించింది శ్వేతారెడ్డి. యశ్విన్‌కు ఫోన్‌చేసి తానుంటున్న ఏరియాకి రప్పించిన శ్వేతారెడ్డి… స్నేహితులు కార్తీక్‌, అశోక్‌తో కలిసి చంపేసింది. ఆ తర్వాత రోడ్డుప్రమాదంగా చిత్రీకరించింది. అయితే, యశ్విన్‌ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తంచేయడంతో శ్వేతారెడ్డి గుట్టు బయటపడింది. నిందితురాలు శ్వేతారెడ్డితోపాటు ఆమెకు సహకరించిన ఆమె ఇద్దరి స్నేహితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

శ్వేతారెడ్డికి సహకరించిన అశోక్‌, కార్తీక్‌ కూడా ఫేస్‌బుక్‌ ఫ్రెండ్సే. అశోక్‌ది ఏపీలోని కృష్ణాజిల్లా తిరువూరు. యశ్విన్‌ను చంపేందుకు ఈనెల 4న అశోక్‌ అండ్‌ కార్తీక్‌ను హైదరాబాద్‌ రప్పించిన శ్వేత, అదే రోజు రాత్రి మర్డర్‌ ప్లాన్‌ ఇంప్లిమెంట్‌ చేశారు. పక్కా ప్లాన్‌తో యశ్విన్‌ను పిలిచి, సుత్తితో కొట్టి పారిపోయారు. కొన ఊపిరితో రెండు రోజులు ఆస్పత్రిలో కొట్టుమిట్టాడిన యశ్విన్‌, ఈనెల 6న మృతిచెందాడు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా శ్వేతారెడ్డితోపాటు ఆమె స్నేహితులు అశోక్‌ అండ్ కార్తీక్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

Yashwin

యశ్విన్(హత్యకు గురైన వ్యక్తి)

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu