5గురు పోలీసులపై హైదరాబాద్ సీపీ వేటు..ఎందుకో తెలుసా?

విధుల్లో నిర్లక్ష్యం చూపినందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్.. పరిపాలనా ప్రాతిపదికన ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లతో సహా ఐదుగురు పోలీసులను సోమవారం సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (సిఎఆర్) కు ఎటాచ్ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజని కుమార్ మాట్లాడుతూ.. సస్పెండ్ చేసిన అధికారుల వివరాలను వెల్లడించారు. హుమయూన్ నగర్ సబ్ ఇన్స్పెక్టర్ కె. సత్యనారాయణ, బంజారా హిల్స్ సబ్ ఇన్స్పెక్టర్ బి. శ్రీనివాస్..బంజారా హిల్స్‌కు చెందిన కానిస్టేబుల్ కె. రంజిత్ కుమార్, […]

5గురు పోలీసులపై హైదరాబాద్ సీపీ వేటు..ఎందుకో తెలుసా?
Follow us

|

Updated on: Oct 10, 2019 | 4:51 AM

విధుల్లో నిర్లక్ష్యం చూపినందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్.. పరిపాలనా ప్రాతిపదికన ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లతో సహా ఐదుగురు పోలీసులను సోమవారం సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (సిఎఆర్) కు ఎటాచ్ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజని కుమార్ మాట్లాడుతూ.. సస్పెండ్ చేసిన అధికారుల వివరాలను వెల్లడించారు. హుమయూన్ నగర్ సబ్ ఇన్స్పెక్టర్ కె. సత్యనారాయణ, బంజారా హిల్స్ సబ్ ఇన్స్పెక్టర్ బి. శ్రీనివాస్..బంజారా హిల్స్‌కు చెందిన కానిస్టేబుల్ కె. రంజిత్ కుమార్, బంజారా హిల్స్ ఠాణాకు చెందిన హెం గార్డు బి. అంజయ్య ..పంజాగుట్టకు చెందిన కానిస్టేబుల్ ఎల్లిషా కిరణ్‌లు తమను సంప్రదించిన వ్యక్తి నుండి ఫిర్యాదు నమోదు చేయకుండా నిర్లక్ష్యం చూపించారు.

సెప్టెంబరు 29 న, ఫిర్యాదుదారుడు తీసుకొచ్చిన కేసును తమ పోలీస్ స్టేషన్ యొక్క అధికార పరిధికి సంబంధించినది కాదని చెప్పి, అతడిని 10 గంటలకు పైగా ఆయా  సర్కిల్స్‌లో తిరిగేలా చేశారని పోలీసు కమిషనర్ తెలిపారు. చివరకు సెప్టెంబర్ 30 న సదరు కేసును సైఫాబాద్ పోలీసులు చేపట్టారు. మసాబ్ ట్యాంక్ ప్రాంతంలోని బంజారా ఫంక్షన్ హాల్ సమీపంలో జరిగిన ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేయాలని ఫిర్యాదుదారుడు కోరినట్లు పోలీసు  వర్గాలు తెలిపాయి. పోలీసు అధికారుల వృత్తిపరమైన తప్పులు మళ్లీ పునరావృతం కాకుండా..ఇటువంటి చర్యలు తీుకున్నట్లు అంజనీ కుమార్ తెలిపారు.