Hyderabad: అంబర్‌పేట సీఐ సుధాకర్‌ అరెస్ట్.. ధరణి లోగోతో నకిలీ పత్రాలు సృష్టించి.. అరకోటికి పైగా..

మహేశ్వరంలో ల్యాండ్ ఇష్యూలో సీఐ. అసలేం జరిగింది. సస్పెన్షన్‌ వెనుక అసలు కథేంటి? ల్యాండ్‌కి సీఐకి ఉన్న డీలేంటి? ఫిర్యాదు చేసిన ఆ ఎన్‌ఆర్‌ఐ ఎవరు?

Hyderabad: అంబర్‌పేట సీఐ సుధాకర్‌ అరెస్ట్.. ధరణి లోగోతో నకిలీ పత్రాలు సృష్టించి.. అరకోటికి పైగా..
Amberpet Ci
Follow us

|

Updated on: Jan 13, 2023 | 8:36 PM

భూ వివాదంలో అంబర్‌పేట ఇన్స్పెక్టర్ సుధాకర్‌ అరెస్ట్ అయ్యారు. ల్యాండ్‌ ఇప్పిస్తానని నకిలీ ఎమ్మార్వోను సృష్టించి ఎన్ఆర్ఐ దగ్గర నుంచి డబ్బులు కాజేశారంటూ ఆరోపణలు రావడంతో సీఐ సుధాకర్‌ను సస్పెండ్‌ చేశారు. ల్యాండ్ రిజిస్ట్రేషన్ పేరుతో ఎన్‌ఆర్ఐని మోసం చేశారనే ఆరోపణలతో ఆయనపై వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సస్పెండెడ్ ఆర్ఐతో కలిసి ల్యాండ్ సెటిల్‌మెంట్ చేసినట్లు విచారణలో తేలింది. ఎన్‌ఆర్‌ఐ నుంచి సుధాకర్‌ 54 లక్షలు తీసుకున్నట్లు తేలింది. మహేశ్వరంలో ల్యాండ్ ఇప్పిస్తానని నకిలీ ఎమ్మార్వోను సృష్టించి ఎన్ఆర్ఐ దగ్గర నుంచి సీఐ సుధాకర్ డబ్బులు కొట్టేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు తరువాత విచారణ జరిపిన హైదరాబాద్ వనస్థలిపురం పోలీసులు సుధాకర్‌ను అరెస్ట్ చేశారు.

సస్పెండైన ఆర్ఐ రాజేష్‌పై వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటికే కేసు నమోదు చేశారు. కందుకూరు లిమిట్స్‌లోని నేదునూరు గ్రామంలో సర్వే నెంబర్ 54/2 లో ఉన్న 10ఎకరాల ల్యాండ్ ఇప్పిస్తానని చెప్పి బి.ఎన్.రెడ్డి ఎ’Hకే డి నగర్ కు చెందిన విజయకుమార్ దగ్గర 54.5 లక్షల రూపాయలు తీసుకొని నెలలు గడుస్తున్నా ల్యాండ్ ఇప్పించకపోవడంతో బాధితులు వనస్థలిపురం పి ఎస్ లో ఫిర్యాదు చేశారు.

మరోవైపు అనేక ఆరోపణలతో సస్పెండైన అర్ఐ తాను ఎమ్మార్వోనంటూ నకిలీ ఐడి కార్డ్ సృష్టించి త్వరలో ప్రమోషన్ ద్వారా ఆర్డీఓ అవుతానని నమ్మించి మోసాలకు పాల్పడుతున్నట్టు తేలింది. రాజేశ్ తమ నుంచి తీసుకున్న 54.5 లక్షల రూపాయలను సిఐ సుధాకర్‌కు ఇచ్చినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

బాధితులకు ఇప్పిస్తానన్న ల్యాండ్.. ఆర్ ఐ రాజేష్ సోదరుడు గతంలోనే కొనుగోలు చేశాడని చెప్పి దానిపై ధరణి పోర్టల్ లోగో తో నకిలీ డాక్యుమెంట్ సృష్టించి ఈ ల్యాండ్ అమ్ముతారంటూ తమ దగ్గర డబ్బులు వసూలు చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితులు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..