OU Lands: ఓయూ భూముల కబ్జాపై హైకోర్టుకు విద్యార్థి లేఖ.. ప్రభుత్వం ఏం చెప్పిందంటే..!

ఓయూ(ఉస్మానియా యూనివర్శిటీ) భూములు కబ్జా వ్యవహారం మీద ఇవాళ హైకోర్టులో వాదనలు జరిగాయి. సుమారు 3 వేల గజాలకు పైగా వర్శిటీకి చెందిన భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసి ఆక్రమిస్తున్నారని ఓయూ విద్యార్థి

OU Lands: ఓయూ భూముల కబ్జాపై హైకోర్టుకు విద్యార్థి లేఖ.. ప్రభుత్వం ఏం చెప్పిందంటే..!
Osmania University
Follow us

|

Updated on: Aug 04, 2021 | 5:05 PM

Osmania University Lands – High Court: ఓయూ(ఉస్మానియా యూనివర్శిటీ) భూములు కబ్జా వ్యవహారం మీద ఇవాళ హైకోర్టులో వాదనలు జరిగాయి. సుమారు 3 వేల గజాలకు పైగా వర్శిటీకి చెందిన భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసి ఆక్రమిస్తున్నారని ఓయూ విద్యార్థి పి.రమణారావు లేఖ రాసిన నేపథ్యంలో ఈ అంశం మీద ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున ఏజీ(అడ్వకేట్ జనరల్) వివరణ ఇస్తూ.. యూనివర్శిటీ భూములు కబ్జాకు కాకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. తులసి హౌజింగ్ సొసైటీపై ఓయూ.. పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఏజీ కోర్టుకు విన్నవించారు.

అయితే, ఆ కేసుకు సంబంధించిన కేసు దర్యాప్తు ఏ స్థాయిలో ఉందో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్ సీపీ, అంబర్ పేట పోలీసులను ప్రవాదులుగా చేర్చిన హైకోర్టు.. ఈ కేసు విచారణను అక్టోబరు20కి వాయిదా వేసింది.

Read also: CI: సీఐ వారి బాగోతం.. రేవ్ పార్టీలో పాల్గొని మందుకొట్టి అమ్మాయిలతో అసభ్యకర నృత్యాలు చేసిన ఉన్నతాధికారి..!