బ్రేకింగ్: దిశ కేసులో కీలక మలుపు.. హైకోర్టు సంచలన తీర్పు

బ్రేకింగ్: దిశ కేసులో కీలక మలుపు.. హైకోర్టు సంచలన తీర్పు

దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిశ హత్యాచారం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఫాస్ట్‌ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు అనుమతిని ఇచ్చింది. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ మొదటి అదనపు సెషన్స్, జిల్లా న్యాయస్థానాన్ని ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టుగా ప్రకటించారు. అయితే దిశ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన న్యాయస్థానం స్పెషల్ కోర్టుకు అనుమతిని ఇచ్చింది. దీంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Dec 04, 2019 | 7:09 PM

దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిశ హత్యాచారం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఫాస్ట్‌ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు అనుమతిని ఇచ్చింది. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ మొదటి అదనపు సెషన్స్, జిల్లా న్యాయస్థానాన్ని ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టుగా ప్రకటించారు. అయితే దిశ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన న్యాయస్థానం స్పెషల్ కోర్టుకు అనుమతిని ఇచ్చింది. దీంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొదటి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు కానుంది. అంతేకాదు ఈ కోర్టుకు ప్రత్యేక న్యాయమూర్తి, పీపీలను హైకోర్టు నియమించనుంది. అయితే నిర్ధేశించిన దిశ కేసును మాత్రమే ఈ స్పెషల్ కోర్టు విచారించనుంది. అలాగే దిశ కేసులో ఇకపై లీగల్ ప్రొసిడింగ్స్ అన్ని స్పెషల్ కోర్టులోనే జరగనుండగా.. నెల రోజుల్లో విచారణ పూర్తి చేసి, దోషులకు శిక్షలు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ కేసులో నిందితులను ఏడు రోజుల పోలీసుల కస్టడీని ఇస్తూ.. షాద్ నగర్ కోర్టు అనుమతిని ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చర్లపల్లి  జైల్లో ఉన్న నిందితులను గురువారం తమ అదుపులోకి తీసుకోనున్న పోలీసులు మరింత లోతుగా విచారించనున్నారు.

ఇదిలా ఉంటే ఈ కేసు గురించి రోజుకో సంచలన విషయం బయటికి వస్తోంది. తాజాగా దిశను బతికుండగానే దహనం చేసినట్లు ప్రధాన నిందితుడు ఆరిఫ్ చెప్పినట్లు జైలు సిబ్బంది ద్వారా తెలిసింది. నిందితుల మానసిక పరిస్థితి తెలుసుకోవడం కోసం కాపలా కాస్తున్న జైలు సిబ్బంది వారితో మాటలు కలపగా.. ఈ దారుణ విషయాలు బయటకు వస్తున్నాయి. అంతేకాదు అత్యాచారం చేసేందుకు ఆమెను ఓ ప్రదేశంలోకి నలుగురు నిందితులు లాక్కెళ్లగా.. ఆ సమయంలో ఆమె గట్టిగా కేకలు వేసిందట. దీంతో చెన్నకేశవులు ఆమె నోట్లో లిక్కర్ పోశాడట. ఇక అప్పటికే భయంతో ఉన్న దిశ లిక్కర్ పోయడంతో అపస్మారక స్థితిలోకి పోయిందని, వెంటనే నలుగురు అత్యాచారం చేశామని వారు సిబ్బందితో చెప్పారు. ఆ తరువాత ఆమెను లారీలో తీసుకునేవెళ్లే సమయంలో కూడా దిశపై మళ్లీ అత్యాచారం చేశామని.. దీంతో పూర్తి అపస్మారక స్థితిలోకి వెళ్లగా, చనిపోయిందని భావించిన తాము పెట్రోల్ పోసి నిప్పంటించామని ఆ నిందితులు వెల్లడించారు. అయితే ఇంత దారుణ అఘాయిత్యానికి ఒడిగట్టి కూడా.. ఆ నిందితుల్లో ఏ మాత్రం తప్పు చేయలేదన్న భావన ఉందని అక్కడి సిబ్బంది తెలిపారు. మరోవైపు జైలులో ఉన్న ప్రధాన నిందితుడు ఆరిఫ్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu