తెలంగాణ ఒలింపిక్ సంఘం ఎన్నికలు.. జయేష్‌ రంజన్‌కు లైన్‌క్లియర్

తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల్లో ఐటీ పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌కు ఊరట లభించింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి జయేష్ రంజన్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయన నామినేషన్‌ను ఇటీవల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. జయేష్ రంజన్ క్యాట్ నుంచి అనుమతి పొందకపోవడంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. అయితే దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో జయేష్ రంజన్‌ పిటిషన్‌‌ను విచారించిన హైకోర్టు.. ఆయన […]

తెలంగాణ ఒలింపిక్ సంఘం ఎన్నికలు.. జయేష్‌ రంజన్‌కు లైన్‌క్లియర్

తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల్లో ఐటీ పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌కు ఊరట లభించింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి జయేష్ రంజన్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయన నామినేషన్‌ను ఇటీవల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. జయేష్ రంజన్ క్యాట్ నుంచి అనుమతి పొందకపోవడంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. అయితే దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

ఈ క్రమంలో జయేష్ రంజన్‌ పిటిషన్‌‌ను విచారించిన హైకోర్టు.. ఆయన నామినేషన్‌ను తిరస్కరించడాన్ని తప్పుబట్టింది. సీఎస్ అనుమతి ఉండటంతో నామినేషన్‌ను ఆమోదించాల్సిందేనని కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో రిటర్నింగ్ అధికారికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ నెల 9న జరిగే ఎన్నికల్లో రంగారావుతో జయేష్ రంజన్ తలపడనున్నారు. ఓ రాజకీయనాయకుడికి, ప్రభుత్వ అధికారికి మధ్య జరుగుతున్న ఈ పోటీపై ఉత్కంఠ నెలకొంది.

Published On - 4:12 pm, Fri, 7 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu