సూపర్‌స్టార్‌ను వెంటాడుతున్న జీఎస్టీ అధికారులు

హైదరాబాద్‌: సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు మరోసారి జీఎస్టీ అధికారులు షాక్‌ ఇచ్చారు. ఆయనకు చెందిన ఏఎంబీ సినిమాస్‌ థియేటర్‌లో ప్రేక్షకుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి కొత్తగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ నిబంధనలు ఏఎంబీ మాల్‌ అతిక్రమించిందని వార్తలు వెలువడుతున్నాయి. రూ.100 ఆ పైన టికెట్‌కు గతంలో 28 శాతం జీఎస్టీ ఉండగా.. జనవరి 1 నుంచి 18 శాతానికి, రూ.100 లోపు టికెట్‌పై 18 శాతాన్ని కాస్తా 12కు తగ్గించింది. […]

సూపర్‌స్టార్‌ను వెంటాడుతున్న జీఎస్టీ అధికారులు
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 6:46 PM

హైదరాబాద్‌: సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు మరోసారి జీఎస్టీ అధికారులు షాక్‌ ఇచ్చారు. ఆయనకు చెందిన ఏఎంబీ సినిమాస్‌ థియేటర్‌లో ప్రేక్షకుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి కొత్తగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ నిబంధనలు ఏఎంబీ మాల్‌ అతిక్రమించిందని వార్తలు వెలువడుతున్నాయి. రూ.100 ఆ పైన టికెట్‌కు గతంలో 28 శాతం జీఎస్టీ ఉండగా.. జనవరి 1 నుంచి 18 శాతానికి, రూ.100 లోపు టికెట్‌పై 18 శాతాన్ని కాస్తా 12కు తగ్గించింది.

అయితే ఏఎంబీ మాల్‌ తగ్గించిన ధరలు అమలు చేయకుండా అక్రమంగా ప్రేక్షకుల నుంచి రూ.30 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దాంతో థియేటర్‌పై కేసు నమోదు చేసి, నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. కొద్దిరోజుల క్రితమే బ్రాండ్ల నుంచి వస్తున్న పారితోషికాలపై పన్ను ఎగ్గొట్టారంటూ మహేశ్‌కు నోటీసులు అందాయి. ఆయన బ్యాంక్‌ ఖాతాలను కూడా సీజ్‌ చేశారు. తాజాగా వస్తున్న ఆరోపణలపై మహేశ్‌ స్పందించాల్సి ఉంది.