Hyderabad: నగరంలో నాలాల పనులను వేగంగా పూర్తి చేయాలి: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

Gadwal Vijayalakshmi: హైదరాబాద్ మహానగరంలో మౌలిక వసతుల అభివృద్ధికి జీహెచ్ఎంసీ పెద్ద పీట వేసినట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. శేర్‌లింగంపల్లి నియోజకవర్గంలో

Hyderabad: నగరంలో నాలాల పనులను వేగంగా పూర్తి చేయాలి: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
Hyderabad
Follow us

|

Updated on: Mar 24, 2022 | 5:33 PM

Gadwal Vijayalakshmi: హైదరాబాద్ మహానగరంలో మౌలిక వసతుల అభివృద్ధికి జీహెచ్ఎంసీ పెద్ద పీట వేసినట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. శేర్‌లింగంపల్లి నియోజకవర్గంలో ప్రజల సౌకర్యం కోసం చందానగర్ మదీనా గూడ,  దీప్తిశ్రీ నగర్, పిజెఆర్ ఎన్ క్లేవ్ వద్ద రూ.10.70  కోట్ల వ్యయంతో చేపట్టిన రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరికేపూడి గాంధీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విశేష కృషి చేస్తున్నారన్నారు. హైదరాబాద్ నగరాన్ని సిగ్నల్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దేందుకు జిహెచ్ఎంసి పరిధిలో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ముఖ్యంగా ఎస్.ఆర్.డి.పి ద్వారా రోడ్ల అభివృద్ధితో పాటు, కాలుష్య నివారణ, సుందరీకరణ పనులు చేపట్టడం జరుగుతుందని వివరించారు. వర్షాకాలంలో వరదలకు గతంలో పలు కాలనీలలో పడిన ఇబ్బందులు అధిగమించేందుకు శాశ్వత పరిష్కారం కోసం రూ.858 కోట్ల వ్యయంతో 60 నాలాల అభివృద్ధి పనులను వచ్చే వర్షాకాలం లోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు మేయర్ అన్నారు. నగరంలో 4 ప్యాకేజీలో రూ. 127 కోట్ల 35 లక్షల వ్యయంతో 21 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను చేపట్టినట్లు తెలిపారు.

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికేపూడి గాంధీ మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధిలో కేసీఆర్, కేటీఆర్ సహాయ సహకారం వలన అన్ని నియోజకవర్గాల కంటే ఇక్కడే ఎక్కువ అభివృద్ధి జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో తాగునీరు పనులు పూర్తి అయ్యాయని, సివరేజ్ పనులు 80 శాతం పూర్తయినట్లు చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి మేయర్, కమిషనర్ సహకారం అందించారన్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జితో ప్రజల ఇక్కట్లు  తొలగిపోతాయన్నారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోసం లిఫ్ట్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

నాలా పనులను వచ్చే మే చివరి వరకు పూర్తి చేయాలి..

నగరంలో చేపట్టిన నాలాల అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. శేరిలింగంపల్లి జోన్లో రెండు పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ ఈరాల చెరవు నుంసీ జాతీయ రహదారి 65 వరకు రూ.15.88 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నిర్దేశించిన కాల వ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు. మేయర్ వెంట జోనల్ కమిషనర్ ప్రియాంక అలా, చీఫ్ ఇంజనీర్ వసంత, ఈ.ఈ  శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

Also Read:

PM Narendra Modi: ప్రధాని మోడీని కలిసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. పలు అంశాలపై చర్చ

Nitin Gadkari: ప్రయాణికుల భద్రతపై ప్రభుత్వం సీరియస్.. ఈ ఏడాది ఇప్పటి వరకు 40 లక్షల చలాన్లు: నితిన్‌ గడ్కారీ