బల్దియా బాద్‌షా తేలేది నేడే.. మరికాసేపట్లో జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం.. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక

ఇవాళ జరిగే జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో మేయర్‌, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నిక ప్రక్రియకు కలెక్టర్‌ శ్వేతామహంతి ప్రిసైడింగ్‌ అధికారిగా వ్యవహరించనున్నారు.

బల్దియా బాద్‌షా తేలేది నేడే.. మరికాసేపట్లో జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం.. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక
Follow us

|

Updated on: Feb 11, 2021 | 6:57 AM

GHMC mayor election : గ్రేటర్ హైదరాబాద్ ప్రథమ పౌరురాలిని ఎన్నికునే సమయం అసన్నమైంది. ఇవాళ జరిగే జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో మేయర్‌, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకోనున్నారు. ఉదయం 11 గంటలకు జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం కానుంది. ముందుగా గ్రేటర్‌ ఎన్నికల్లో గెలుపొందిన 149 మంది కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. మధ్యాహ్న 12.30 గంటలకు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక కోసం ప్రత్యేకంగా సమావేశం కానుంది.

ఈ ఎన్నిక ప్రక్రియకు కలెక్టర్‌ శ్వేతామహంతి ప్రిసైడింగ్‌ అధికారిగా వ్యవహరించనున్నారు. ఎన్నికల పరిశీలకునిగా ఐఏఎస్‌ అధికారి సందీప్‌కుమార్‌ సుల్తానియాను ఎన్నికల సంఘం నియమించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 150 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అయితే అందులో ఒక కార్పొరేటర్ చనిపోవడంతో.. కౌన్సిల్‌లో 149 మంది కార్పొరేటర్లు, అలాగే 44 మంది ఎక్స్‌అఫీషియోలతో కలిపి మొత్తం సభ్యులు 193 మిగిలారు. వీరిలో 97 మంది హాజరైతే కోరం ఉన్నట్టుగా పరిగణిస్తూ మేయర్ ఎన్నిక జరగనుంది. వీరిలో ఎక్కువ మంది సభ్యుల మద్దతున్న కార్పోరేటర్.. మేయర్‌, డిప్యూటీ మేయర్‌గా ఎన్నికవుతారు. ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. మేయర్‌ ఎన్నిక నేపథ్యంలో అధికార యంత్రాంగం సకల ఏర్పాట్లు చేసింది.

కాగా, మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవుల కోసం పోటీ అసక్తికరంగా మారింది. అత్యధిక వార్డులు గెలుచుకున్న టీఆర్ఎస్ పార్టీ మేయర్ దక్కించుకునేందుకు ఫ్లాన్ చేసింది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత కేసీఆర్ అభ్యర్థి పేరును సీల్డు కవర్ ఉంచారు. అయితే, అనూహ్యంగా బీజేపీ తమ పార్టీ తరుపున మేయర్ అభ్యర్థి పేరు ప్రకటించడంతో ఎన్నిక నిర్వహణ అనివార్యం కానుంది. మరోవైపు, ఎన్నికకు సంబంధించి కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులకు టీఆర్‌ఎస్‌ విప్‌ జారీ చేసింది. దీనికి సంబంధించి ఫారం-ఏ, అనెగ్జర్‌-1,2లను ప్రిసైడింగ్‌ అధికారి శ్వేతామహంతికి ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు, టీఆర్‌ఎస్‌ నేతలు గుర్రం పవన్‌కుమార్‌గౌడ్‌ గురువారం అందజేశారు.

ఇక, బీజేపీ నుంచి గుడి మల్కాపుర్‌ కార్పొరేటర్‌ దేవర కరుణాకర్‌ అనెగ్జర్‌-1,2లను, ఎంఐఎం నుంచి ఎమ్మెల్యే పాషాఖాద్రీ ఫారం-ఏ, అనెగ్జర్‌-1,2లు ప్రిసైడింగ్‌ అధికారికి ఇచ్చారు. ఎంఐఎం కూడా విప్‌ జారీ చేసిన నేపథ్యంలో ఆ పార్టీ బరిలో ఉంటుందా..? లేదా..? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నేడు దారుస్సలాంలో కార్పొరేటర్లతో అసదుద్దీన్‌ అల్పాహార విందు అనంతరం పోటీ చేస్తామా..? లేదా..? అన్న దానిపై స్పష్టత వస్తుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎంఐఎం బరిలో నిలిస్తే మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు త్రిముఖ పోరు తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక, ఎంఐఎం పోటీ చేయని పక్షంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య పోటీ ఉండే అవకాశముంది. పోటీ చేయకుంటే ఎంఐఎం తటస్థంగా ఉంటుందా..? ఎవరికైనా మద్దతునిస్తుందా..? అన్నది కీలకంగా మారనుంది.

జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపిక ఇలా…

⚜ ఉదయం 11 గంటలకు కౌన్సిల్‌ సమావేశం ప్రారంభం.

⚜ కార్పొరేటర్లు పదవీ ప్రమాణ స్వీకారం.

⚜ మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక కోసం జీహెచ్ఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం.

⚜ 97 మంది సభ్యులు హాజరైతేనే ఎన్నిక ప్రక్రియ మొదలు.

⚜ సభ్యుల కోరం లేకుంటే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక మరునాటికి సమావేశం వాయిదా

⚜ ఎన్నిక ప్రక్రియలో భాగంగా మేయర్‌ పదవి కోసం పోటీదారుల పేర్లను ప్రిసైడింగ్‌ తీసుకుంటారు.

⚜ మేయర్‌గా పోటీ చేసే వ్యక్తి పేరును ఒకరు ప్రతిపాదిస్తే.. మరొకరు బలపర్చాల్సి ఉంటుంది.

⚜ గుర్తింపు పొందిన పార్టీ నుంచి మేయర్‌ పదవి కోసం పోటీ పడుతున్న వ్యక్తి సంబంధిత పార్టీ అధ్యక్షుని ధృవీకరణతో కూడిన ఫారం-ఏ, ఫారం-బీ పత్రాలు ప్రిసైడింగ్‌ అధికారికి సమర్పించాలి.

⚜ ఒకరి కంటే ఎక్కువ మంది పేర్లు నమోదు చేసుకున్న పక్షంలో ఎన్నిక నిర్వహిస్తారు.

⚜ తెలుగు అక్షర క్రమం ప్రకారం ఒక్కో వ్యక్తి పేరు చెప్పి మద్దతిచ్చేది ఎంత మందన్నది చేతులెత్తే విధానం ద్వారా లెక్కిస్తారు. ఇందుకోసం రో ఆఫీసర్లను నియమించారు.

⚜ సమావేశంలో ఉన్న సభ్యుల్లో ఎక్కువ మంది మద్దతున్న వారు మేయర్‌గా ఎన్నిక.

⚜ ఇదే తరహాలో డిప్యూటీ మేయర్‌ ఎన్నిక ప్రక్రియ.

⚜ కోరం లేక రెండు సార్లు సమావేశం వాయిదా పడిన పక్షంలో ఎన్నికల సంఘానికి ప్రిసైడింగ్‌ అధికారి నివేదిక.

⚜ ఆతర్వాత ఎన్నికల సంఘం ఖరారు చేసిన తేదీన కోరం లేకున్నా.. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకుంటారు.

ఇది చదవండి… Gold Price Today: మళ్లీ పరుగులు పెడుతున్న పసిడి.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..