Pet Animals: మీ పెంపుడు జంతువులకు శాస్త్రీయ పద్ధతిలో గౌరవ ప్రదమైన అంత్యక్రియలు.. జీహెచ్ఎంసీ పరిధిలో క్రిమిటోరియాలు ఏర్పాటు

భారతదేశం నైపుణ్యం కలిగిన యువ శ్రామికశక్తికి జర్మనీ గ్రీన్ కార్పేట్ స్వాగతం పలుకుతోంది. నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ జర్మనీతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తద్వారా యువత ఈ ఉపాధి అవకాశాలను పొందుతారు.

Pet Animals: మీ పెంపుడు జంతువులకు శాస్త్రీయ పద్ధతిలో గౌరవ ప్రదమైన అంత్యక్రియలు.. జీహెచ్ఎంసీ పరిధిలో క్రిమిటోరియాలు ఏర్పాటు
Pet Animal Crematorium
Follow us

|

Updated on: Dec 12, 2022 | 5:27 PM

పెంపుడు జంతువులంటే మనలో చాలా మందికి ప్రాణం. అంతేకాదు మనలో చాలా మంది వాటిని తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారు. అవి కూడా అంతకంటే ఎక్కవగా వారి ఫ్యామిలీలో కలిసిపోతుంటాయి. వాటి చిన్న జ్వరం వచ్చిందంటే ఇంటిళ్లిపాది ఆందోళనకు గురవుతారు. అవి చేసే చిలిపి పనులతో మురిసిపోతారు. అయితే జంతువులను పెంచుకునే వారు వాటిపై చూపించే ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు.  తమ ఇంట్లో పిల్లలను ఎంత ప్రేమగా చూసుకుంటారో పెంపుడు జంతువులనుమ అలాగే చూసుకుంటారు. ఈ మధ్యకాలంలో పెట్ డాగ్స్‌ను పెంచుకునేవారి సంఖ్య విరివిగా పెరిగింది. కొన్నాళ్ల కిందట వరకూ ఎక్కువగా కుక్కల్ని పెంచుకునేవారు. కానీ ఇప్పుడు భాగ్యనగరంలో కుక్కలతో పాటు పిల్లులను, పక్షులను పెంచుకుంటున్నవారి సంఖ్య కూడా భాగా పెరిగింది.

అయితే వీటిని పెంచుకునేవారు తమతో ఉన్నంతకాలం వాటిని కుటుంబసభ్యులుగానే చూసుకుంటున్నారు. వాటిని జీవనకాలం మనకంటే చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఎంతో ప్రేమతో పెంచుకున్న జంతువులు చనిపోయిన తర్వాత వాటిని ఎలా ఖననం చేయాలో మాత్రం వారికి తెలియడం లేదు. ఇలాంటి సమయంలో వారు నగరంలోని ఓ చివరికి తీసుకెళ్లి అక్కడ పడేయడమో.. లేదా ఓ గుంత తీసి అందులో పాతిపెట్టి రావడమో చేస్తుంటారు. అవి బతికున్నంతకాలం కంటికి రెప్పలా కాపాడుకున్న వారికి వాటిని అలా చేయడం చాలా ఇబ్బందిగా మారుతోంది.

ఈ సమస్యను గమనించిన కొందరు జీహెచ్ఎంసీ కొత్త ఐడియాతో ముందుకు వచ్చింది. తమ పెంపుడు జంతువు ఏ కారణంతో చనిపోయినా.. సంప్రదాయబద్దంగా వీడ్కోలు పలికేందుకు ప్రత్యేకంగా శ్మశాన వాటికను అందుబాటులోకి తెచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలో స్వచ్ఛంద సంస్థ సహకారంతో రాష్ట్రంలోనే మొట్ట మొదటి సారిగా ఫతుల్లగూడలో ఏర్పాటు చేసిన పెంపుడు జంతువుల క్రిమిటోరియం ఏర్పాటు చేశారు.

రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో మరో 5 పెంపుడు జంతువుల క్రిమిటోరియాల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. డిసెంబర్ 6న రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ నాగోల్ సర్కిల్ లోని ఫతుల్లాగూడలో జీహెచ్ఎంసీకి చెందిన జంతు సంరక్షణ కేంద్రంలో  పీపుల్ ఫర్ అనిమల్స్ (PFA) సహకారంతో  పెంపుడు జంతువుల స్మశాన వాటికకు ప్రారంభోత్సవం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో మిగతా జోన్లలో జోన్ కు ఒక్కటి చొప్పున ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.

జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వీధి కుక్కలు, కోతులు, పశువుల పరిరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. వీధి కుక్కల నియంత్రణ కోసం ఏనిమాల్ బర్త్ కంట్రోల్  ప్రోగ్రామ్ ద్వారా బర్త్ కంట్రోల్ ఆపరేషన్ లు, యాంటీ రేబిస్ టీకాలు లాంటి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అందు కోసం నగర వ్యాప్తంగా 5 ఏనిమల్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా క్షేత్ర స్థాయిలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది అందు కోసం 39 వాహనాలను కూడా ఏర్పాటు చేశారు.

ఫతుల్లాగూడలో పీపుల్ ఫర్ అనిమల్స్ ( PFA)  వారు రూ. 51.25 లక్షలతో అవసరమైన యంత్రాలు కొనుగోలు చేశారు. జిహెచ్ఎంసి ద్వారా మరో రూ. 33.50 లక్షల వ్యయంతో సదుపాయాలు కల్పించారు. దీంతో అక్కడ అన్ని వసతులతో  పెంపుడు జంతువుల స్మశాన వాటిక సిద్దం చేశారు. ఈ కేంద్రాన్ని స్వచ్ఛంద సంస్థ  నామమాత్రపు రుసుముతో పెంపుడు జంతువులను ఎల్ పి జి గ్యాస్ తో భస్మీకరణ చేస్తారు. కాలుష్య నియంత్రణ మండలి (పిసిబి) నియమ నిబంధనల మేరకు   ఎలాంటి  కాలుష్యం లేకుండా సున్నా ఉద్గారాలతో  శాస్త్రీయ పద్ధతిలో  పెంపుడు జంతువుల కోసం గౌరవ ప్రదమైన అంత్యక్రియలు జరుపుతారు.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన PFA సంస్థ అయినందున మిగతా జోన్లలో ఏర్పాటు చేసిన పెంపుడు జంతువుల  స్మశాన వాటిక నిర్వహణ చేసే స్వచ్ఛంద సంస్థలు కూడా యానిమల్ బోర్డ్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొంది ఉండాలి. ఎల్బీనగర్ జోన్ లో ఇప్పటి కే ఫతుల్లాగూడలో ఏర్పాటు చేయగా మంత్రి కే టి ఆర్ ఆదేశాల మేరకు సికింద్రాబాద్, శేరిలింగంపల్లి,  కూకట్ పల్లి,  ఖైరతాబాద్, చార్మినార్ జోన్ లో గల ఏర్పాటు చేసిన జంతు సంరక్షణ కేంద్రాలలో  ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఫతుల్లాగూడతో పాటుగా చుడి బజార్,  అంబర్ పేట, మహదేవ్ పూర, కే పి ఏచ్ బి కాలనీ లలో ఏర్పాటు చేసిన అనిమల్ కేర్ సెంటర్ లో పెంపుడు జంతువుల క్రిమి టో రీయం లు ఏర్పాటు చేస్తారు శేరిలింగంపల్లి జోన్ నల్ల గండ్ల, చార్మినార్ జోన్ లో కాటేదాన్ లో నూతనంగా అనిమల్ కేర్ సెంటర్  నిర్మాణం చేయుటకు స్థల సేకరణ పూర్తి చేశారు . కేంద్ర ప్రభుత్వ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ సూచనలతో పాటు జిహెచ్ఎంసి రూల్స్ ప్రకారం గా పెంపుడు జంతువుల క్రిమి టో రియం లను ఏర్పాటు చేయనున్నారు.

ఫతుల్లాగూడ పీపుల్స్ ఫర్ యానిమల్ స్వచ్ఛంద సహకారం చేయగా నూతనంగా ఏర్పాటు చేసే ఈ కేంద్రాలకు భస్మికరణ చేసే యంత్రాలు , జిహెచ్ఎంసి నిధులతో ఏర్పాటు చేస్తారు . వాటి  నిర్వహణ మాత్రం స్వచ్ఛంద సంస్థలు చేస్తాయి ఈ సంస్థలు జిహెచ్ఎంసి నిర్ణయించిన ధరకే  పెంపుడు జంతువులను గౌరవ ప్రదమైన అంత్యక్రియులు జరుపుతారు.  స్వచ్ఛంద సంస్థలు రికార్డు,ఎల్ పీ జి గ్యాస్, భద్రపరిచేందుకు ఫ్రిడ్జ్ లు అవసరమైన సిబ్బందికి వేతనాలు చెల్లింపు ఇతరత్రా ఖర్చులు మాత్రం స్వచ్ఛంద సంస్థ భరించవలసి ఉంటుంది..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!