Hyderabad: నాంపల్లిలో గగన్ విహార్ లో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు.. నాలుగు కార్లు దగ్ధం..

హైదరాబాద్‌ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నాంపల్లి గగన్‌విహార్‌లో మంటలు చెలరేగాయి. పార్కింగ్‌ చేసిన కారు నుంచి మంటలు ఒక్కసారిగా వచ్చాయి. ఎలక్ట్రిక్‌ కారు నుంచి మంటలు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు...

Hyderabad: నాంపల్లిలో గగన్ విహార్ లో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు.. నాలుగు కార్లు దగ్ధం..
Fire Accident In Nampalli
Follow us

|

Updated on: Jan 21, 2023 | 9:12 PM

హైదరాబాద్‌ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నాంపల్లి గగన్‌విహార్‌లో మంటలు చెలరేగాయి. పార్కింగ్‌ చేసిన కారు నుంచి మంటలు ఒక్కసారిగా వచ్చాయి. ఎలక్ట్రిక్‌ కారు నుంచి మంటలు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో మరో నాలుగు కార్లకు మంటలు అంటుకున్నాయి. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పొగతో అక్కడ ఉన్న వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో నాంపల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది. కాగా.. సికింద్రాబాద్ జరిగిన అగ్ని ప్రమాదం ఘటనను మరవకముందే .. ఈ ప్రమాదం జరగడం గమనార్హం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..