మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.! విదేశీ మద్యం ధరల్లో మార్పులు ఉండవు.?

Foreign Liquor Rates Telangana: కోవిడ్ సంక్షోభ సమయాల్లో కూడా విదేశీ మద్యం అమ్మకాలు తెలంగాణలో భారీగా జరిగాయి. విదేశీ లిక్కర్ బ్రాండ్లపై...

మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.! విదేశీ మద్యం ధరల్లో మార్పులు ఉండవు.?
liquor-shops
Follow us

|

Updated on: Feb 27, 2021 | 12:30 PM

Foreign Liquor Rates Telangana: ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman ప్రవేశపెట్టిన బడ్జెట్ 2021-22‌లో కొత్తగా ‘అగ్రిసెస్’‌ను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇంపోర్టెడ్ మద్యంపై కేంద్రం 100 శాతం అగ్రిసెస్‌ను ప్రతిపాదించింది. ఇక ఈ ప్రతిపాదనతో ధరల్లో ఎలాంటి పెరుగుదల ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం విదేశీ మద్యం ధరలను తగ్గించే యోచన తెలంగాణ ప్రభుత్వానికి లేదని తెలుస్తోంది.

కోవిడ్ సంక్షోభ సమయాల్లో కూడా విదేశీ మద్యం అమ్మకాలు తెలంగాణలో భారీగా జరిగాయి. విదేశీ లిక్కర్ బ్రాండ్లపై 150 శాతం ఎక్సైజ్ డ్యూటీని విధిస్తుండగా.. ప్రస్తుతం దాన్ని 75 శాతానికి తగ్గించాలని కేంద్రం ప్రతిపాదించింది. ఇక కోవిడ్ సమయంలో తెలంగాణ ప్రభుత్వం లోకల్ మద్యం రేట్లను పెంచి భారీ ఆదాయాన్ని పొందిన విషయం విదితమే.

దీనిపై ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ”రాష్ట్రంలో విదేశీ మద్యం ధరలలో ఎలాంటి మార్పులు ఉండవు. ఎక్సైజ్, పెట్రోల్ రాష్ట్రానికి ఆదాయ వనరులు కావడం వల్ల ధరలను తగ్గించలేమని చెప్పుకొచ్చారు. (Foreign Liquor Rates Telangana)

‘అగ్రిసెస్’పై కేంద్రం వివరణ ఇదే… 

ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2021-22‌లో కొత్తగా ‘అగ్రిసెస్’‌ను ప్రతిపాదించారు. పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్, ఆల్కహాల్ ఇలా పలు దిగుమతి చేసుకునే వస్తువులపై కేంద్రం అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్(AIDC) విధించేందుకు సిద్దమైంది. అటు మద్యంపై కేంద్రం 100 శాతం అగ్రిసెస్‌ను ప్రతిపాదించడంతో ఒక్కసారిగా మందుబాబులకు షాక్ తగిలింది.

అయితే తాజాగా ప్రతిపాదించిన అగ్రిసెస్ ద్వారా ధరల్లో ఎలాంటి పెరుగుదల ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటిదాకా ఇంపోర్టెడ్ మద్యంపై 150 శాతం కస్టమ్స్ డ్యూటీ విధిస్తున్న కేంద్రం.. దాన్ని 50 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీనితో మద్యంపై కస్టమ్స్ డ్యూటీ, AIDC కలిసి మొత్తంగా 150 శాతానికే పరిమితం కానుందని కేంద్రం పేర్కొంది. కాగా, మద్యం ద్వారా కేంద్రానికి అధిక ఆదాయం వస్తుందన్న సంగతి తెలిసిందే. అందుకే దీన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) నుంచి కూడా మినహాయింపు ఇచ్చారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

కస్టమర్‌పై అరిస్తే.. డెలివరీ బాయ్‌ను మంచి పని చేశావంటున్నారు.. కారణం ఏంటంటే.. వీడియో వైరల్..!

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానానికి టీమిండియా.. అదే జరిగితే టోర్నీ నుంచి ఔట్.!

న్యూడ్ ఫోటో అడిగిన నెటిజన్‌కు యాంకర్ శ్రీముఖి అదిరిపోయే కౌంటర్.. ఏం షేర్ చేసిందంటే.!

హైదరాబాద్‌లోని బాలానగర్‌ ఫ్లైఓవర్‌ కుప్పకూలిందా.? వైరల్ అవుతున్న వీడియో.! ఎప్పటిదంటే..!!

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..