రెయిన్ ఎఫెక్ట్: ప్రబలుతున్న వ్యాధులు.. కిటకిటలాడుతున్న ఆస్పత్రులు

వర్షాకాలం రావడంతో హైదరాబాద్ నగరం విష జ్వరాలతో హడలెత్తిపోతుంది. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా వ్యాధిగ్రస్తులతో హాస్పిటల్స్ కిక్కిరిసిపోతున్నాయి. ఏరోజుకారోజు అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. హైదరాబాద్ నగరం విష జ్వరాలతో నిండిపోయింది. ఎటు చూసినా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వ్యాధులు జనాన్ని వెంటాడుతున్నాయి. సాధారణంగా రోజుకి OPలో 1000, 1100 వరకు కేసులు వస్తాయి. కానీ.. ఈసారి ఒక్కసారిగా 3000 వరకు OPలో రోగులు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో సాధారణంగా వెయ్యికి […]

రెయిన్ ఎఫెక్ట్: ప్రబలుతున్న వ్యాధులు.. కిటకిటలాడుతున్న ఆస్పత్రులు


వర్షాకాలం రావడంతో హైదరాబాద్ నగరం విష జ్వరాలతో హడలెత్తిపోతుంది. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా వ్యాధిగ్రస్తులతో హాస్పిటల్స్ కిక్కిరిసిపోతున్నాయి. ఏరోజుకారోజు అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి.

హైదరాబాద్ నగరం విష జ్వరాలతో నిండిపోయింది. ఎటు చూసినా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వ్యాధులు జనాన్ని వెంటాడుతున్నాయి. సాధారణంగా రోజుకి OPలో 1000, 1100 వరకు కేసులు వస్తాయి. కానీ.. ఈసారి ఒక్కసారిగా 3000 వరకు OPలో రోగులు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో సాధారణంగా వెయ్యికి పైగా కేసులు నమోదైతే ఒక్క రోజుకి మూడు వేల వరకు రోగులు కిక్కిరిసి పోతున్న పరిస్థితి అందులోనూ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోగుల సంఖ్య 60 వరకు ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వ్యాధులకు సంబంధించిన కేసులు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో కేసులు పెరిగిపోతున్నట్లు వైద్యులు తెలిపారు.

అటు.. హైదరాబాద్‌లో పెద్ద ఆస్పత్రి అయిన.. గాంధీలో కూడా పరిస్థితి ఇదేవిధంగా ఉందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఇది వర్షాకాలం సీజన్ కనుక ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Click on your DTH Provider to Add TV9 Telugu