స్కూటీపై వచ్చి.. కుక్కల కిడ్నాప్..!

ఏదో సినిమాలో చూపించినట్టు.. కుక్క దొంగతనాలు మొదలయ్యాయి. సైనిక్‌పూరిలో పెంపుడు కుక్క కిడ్నాప్‌కు గురైంది. గుర్తు తెలియని ముగ్గురు యువకులు స్కూటీపై వచ్చి కిడ్నాప్‌ చేసినట్లు సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఇంటి బయట తిరుగుతున్న కుక్క కనిపించకుండా పోవడంతో పెంపుడు కుక్క యజమాని వంశీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇష్టంగా పెంచుకుంటున్న కుక్క కనిపించకుండా పోవడంతో కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. కుక్క కిడ్నాపర్ల […]

స్కూటీపై వచ్చి.. కుక్కల కిడ్నాప్..!
TV9 Telugu Digital Desk

| Edited By:

Jul 23, 2019 | 9:36 PM

ఏదో సినిమాలో చూపించినట్టు.. కుక్క దొంగతనాలు మొదలయ్యాయి. సైనిక్‌పూరిలో పెంపుడు కుక్క కిడ్నాప్‌కు గురైంది. గుర్తు తెలియని ముగ్గురు యువకులు స్కూటీపై వచ్చి కిడ్నాప్‌ చేసినట్లు సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఇంటి బయట తిరుగుతున్న కుక్క కనిపించకుండా పోవడంతో పెంపుడు కుక్క యజమాని వంశీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇష్టంగా పెంచుకుంటున్న కుక్క కనిపించకుండా పోవడంతో కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. కుక్క కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu