సజ్జనార్ భార్యకు అప్పుడు ప్రశ్నలు.. ఇప్పుడు ప్రశంసలు

దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిశ హత్యాచారం కేసు నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌తో సీపీ సజ్జనార్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘సాహో సజ్జనార్’, ‘సరిలేరు మీకెవ్వరు’, ‘ద రియల్ హీరో’, ‘ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఆయనపై అందరూ ట్వీట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే దిశపై హత్యాచారం జరిగిన తరువాత సజ్జనార్ భార్యకు వందల మెసేజ్‌లు, కాల్స్ వచ్చాయట. పలువురు ఐపీఎస్, ఐఏఎస్‌ల భార్యలు ఆమెకు మెసేజ్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:02 pm, Fri, 6 December 19
సజ్జనార్ భార్యకు అప్పుడు ప్రశ్నలు.. ఇప్పుడు ప్రశంసలు

దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిశ హత్యాచారం కేసు నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌తో సీపీ సజ్జనార్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘సాహో సజ్జనార్’, ‘సరిలేరు మీకెవ్వరు’, ‘ద రియల్ హీరో’, ‘ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఆయనపై అందరూ ట్వీట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే దిశపై హత్యాచారం జరిగిన తరువాత సజ్జనార్ భార్యకు వందల మెసేజ్‌లు, కాల్స్ వచ్చాయట. పలువురు ఐపీఎస్, ఐఏఎస్‌ల భార్యలు ఆమెకు మెసేజ్ చేశారట. మీ ఆయన ఎందుకు ఎన్‌కౌంటర్ చేయలేదు..? అంటూ చాలామంది సజ్జనార్ భార్యకు మెసేజ్‌లు చేశారట. ఇక ఈ మెసేజ్‌లు పక్కనపెడితే.. ఇవాళ ఆ రాక్షస మృగాలను ఎన్‌కౌంటర్ చేశారు. దీంతో మళ్లీ కంగ్రాట్స్ మేడమ్ అని చెబుతూ చాలామంది సజ్జనార్ భార్యకు తమ అభినందనలు తెలిపినట్లు సమాచారం.

కాగా గతంలో ఉమ్మడి ఏపీలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వరంగల్ జిల్లాలో అమ్మాయిలపై యాసిడ్ దాడి జరిగింది. ఆ సమయంలో నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు. అప్పుడు వరంగల్ జిల్లా ఎస్పీగా ఉన్న సజ్జనార్ ఈ ఎన్‌కౌంటర్ వెనుక ఉండగా.. తాజాగా ఈ ఘటన వెనుక కూడా ఆయన ఉండటం విశేషం.