Telangana: బీ అలర్ట్.. రోజురోజుకు పెరుగుతున్న కరోనా.. జాగ్రత్తలు పాటించకుంటే అంతే సంగతులు

తెలంగాణలో(Telangana) కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 493 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో...

Telangana: బీ అలర్ట్.. రోజురోజుకు పెరుగుతున్న కరోనా.. జాగ్రత్తలు పాటించకుంటే అంతే సంగతులు
Follow us

|

Updated on: Jun 25, 2022 | 8:47 AM

తెలంగాణలో(Telangana) కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 493 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో హైదరాబాద్(Hyderabad) లోనే 366 కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి తెలంగాణలో ప్రస్తుతం 3,322 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోనే రికార్డు స్థాయిలో 3.62 శాతం పాజిటివిటీ రేటు వచ్చింది. హైదరాబాద్‌లో 2.98 శాతం, మేడ్చల్‌ జిల్లాలో 1.93 శాతం నమోదైంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ అలర్ట్ అయింది. ప్రతి ఒక్కరూ కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించింది. బయటకు వెళ్లేవారు, సమూహాల్లో తిరిగేవారు తప్పకుండా మాస్క్ పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించాలని కోరింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, చిన్న పిల్లలు, 60 ఏళ్లు నిండిన వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

ప్రస్తుత వర్షాకాలం ఫ్లూ సీజన్‌ లో లక్షణాల నుంచి కొవిడ్‌ను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు వ్యాక్సినేషన్‌ వేయించడం అత్యంత అవసరం. 12 నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వ్యాక్సినేషన్‌ కవరేజీ చాలా తక్కువగా ఉంది. త్వరలోనే పాఠశాలలు పూర్తి స్థాయిలో తెరుచుకోనుండటంతో పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు పిల్లలందరికీ టీకాలు వేయించేలా తగిన చర్యలు తీసుకోవాలి.

      – శ్రీనివాసరావు, తెలంగాణ డీహెచ్‌

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి