నగరవాసులకు మరో షాక్.. ఇక సమ్మె బాటలో..

ఇప్పటికే ఆర్టీసీ సమ్మెతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనానికి రేపటి నుంచి మరో షాక్ తగలబోతోంది. ఆర్టీసీ సమ్మె బాట పట్టినట్లే క్యాబ్ డ్రైవర్లు కూడా నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నెల 19 అనగా రేపటి నుంచి నగరంలోని ఉబర్, ఓలా, ఐటీ కంపెనీలకు సేవలందిస్తున్న దాదాపు 50 వేల క్యాబ్‌లు సమ్మెలో పాల్గొనబోతున్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ ట్యాక్సీ, డ్రైవర్స్‌ ఐకాస ఛైర్మన్‌ షేక్‌ సలావుద్దీన్‌ ప్రకటించారు. కిలోమీటరుకు కనీసం రూ.22 చేయాలన్న డిమాండ్‌తో సమ్మె […]

నగరవాసులకు మరో షాక్.. ఇక సమ్మె బాటలో..
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2019 | 9:00 AM

ఇప్పటికే ఆర్టీసీ సమ్మెతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనానికి రేపటి నుంచి మరో షాక్ తగలబోతోంది. ఆర్టీసీ సమ్మె బాట పట్టినట్లే క్యాబ్ డ్రైవర్లు కూడా నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నెల 19 అనగా రేపటి నుంచి నగరంలోని ఉబర్, ఓలా, ఐటీ కంపెనీలకు సేవలందిస్తున్న దాదాపు 50 వేల క్యాబ్‌లు సమ్మెలో పాల్గొనబోతున్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ ట్యాక్సీ, డ్రైవర్స్‌ ఐకాస ఛైర్మన్‌ షేక్‌ సలావుద్దీన్‌ ప్రకటించారు. కిలోమీటరుకు కనీసం రూ.22 చేయాలన్న డిమాండ్‌తో సమ్మె చేయనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా క్యాబ్ డ్రైవర్లకు మినిమమ్ బిజినెస్ గ్యారంటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఐటీ కంపెనీలకు అనుసంధానంగా పనిచేస్తున్న క్యాబ్ డ్రైవర్లకు జీవో నెం.61, 66 అమలు చేయాలని.. డ్రైవర్లపై దాడుల కేసులను పరిష్కరించేందుకు వినియోగదారుల కేవైసీ తప్పనిసరి చేయాలని కోరారు. అంతేకాదు ట్యాక్సీ డ్రైవర్ల సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేయాలన్నారు. అయితే ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధమైంది.