బ్రేకింగ్: ఛార్జీలు, బస్‌పాస్‌ల ధరల పెంపు.. కొత్త లిస్ట్ ఇదే..!

బ్రేకింగ్: ఛార్జీలు, బస్‌పాస్‌ల ధరల పెంపు.. కొత్త లిస్ట్ ఇదే..!

కార్మికుల సమ్మెతో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటల్లోకి తెచ్చేందుకు చార్జీలను పెంచబోతున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు తాజాగా ఆర్టీసీ యాజమాన్యం బస్సు ఛార్జీలను, బస్‌పాస్‌ల ధరలను పెంచింది. దీని ప్రకారం పల్లెవెలుగు బస్సులో కనీస ఛార్జీ రూ.10లకు(గతంలో రూ.8) పెంచారు. సెమీ ఎక్స్‌ప్రెస్ కనీస ఛార్జీ రూ.10లు.. ఎక్స్‌ప్రెస్ కనీస ఛార్జీ రూ.15లు(గతంలో రూ.10), డీలక్స్ ఛార్జీ రూ.20లు(గతంలో రూ.15), సూపర్‌ లగ్జరీలో కనీస ఛార్జీ రూ.25(గతంలో రూ.20).. […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Dec 02, 2019 | 2:49 PM

కార్మికుల సమ్మెతో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటల్లోకి తెచ్చేందుకు చార్జీలను పెంచబోతున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు తాజాగా ఆర్టీసీ యాజమాన్యం బస్సు ఛార్జీలను, బస్‌పాస్‌ల ధరలను పెంచింది. దీని ప్రకారం పల్లెవెలుగు బస్సులో కనీస ఛార్జీ రూ.10లకు(గతంలో రూ.8) పెంచారు. సెమీ ఎక్స్‌ప్రెస్ కనీస ఛార్జీ రూ.10లు.. ఎక్స్‌ప్రెస్ కనీస ఛార్జీ రూ.15లు(గతంలో రూ.10), డీలక్స్ ఛార్జీ రూ.20లు(గతంలో రూ.15), సూపర్‌ లగ్జరీలో కనీస ఛార్జీ రూ.25(గతంలో రూ.20).. రాజధాని, వజ్ర బస్సుల్లో కనీస ఛార్జీ రూ.35, గరుడ ఏసీ, గరుడ ప్లస్ ఏసీల్లో రూ.35లుగా నిర్ణయించారు.

మరోవైపు బస్‌పాస్ వినియోగదారులకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. సిటీ ఆర్టినరీ పాస్ ఛార్జీ రూ.950(గతంలో ర.770)కు.. మెట్రో పాస్ ఛార్జీ రూ.1070(గతంలో రూ.880)కు.. మెట్రో డీలక్స్ పాస్ ధర రూ.1180(గతంలో రూ.990)కు పెంచింది. అలాగే స్టూడెంట్ బస్‌పాస్ ధరను రూ.130 నుంచి రూ.165కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తానికి కొత్త ఛార్జీలతో ప్రయాణికులపై భారీ మోత పడనుంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu