Dilsukhnagar Blasts: నేటితో దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్లకు ఏడేళ్లు పూర్తి..!

ఎప్పటిలాగే ఆ సాయంత్రం నగరంలోని దిల్‌సు‌ఖ్‌నగర్ బిజీబిజీగా ఉంది. హోటళ్లు, షాపింగ్ మాల్‌లు అన్నీ కిక్కిరిసి ఉన్నాయి. ఆ ప్రదేశంలో పేరుగాంచిన సాయిబాబా ఆలయానికి భక్తుల రాకపోకలు కొనసాగుతున్నాయి. పలు ప్రదేశాల నుంచి అక్కడకు వెళ్లిన నగరవాసులు ఎవరి

Dilsukhnagar Blasts: నేటితో దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్లకు ఏడేళ్లు పూర్తి..!
Follow us

| Edited By:

Updated on: Feb 21, 2020 | 2:08 PM

ఎప్పటిలాగే ఆ సాయంత్రం నగరంలోని దిల్‌సు‌ఖ్‌నగర్ బిజీబిజీగా ఉంది. హోటళ్లు, షాపింగ్ మాల్‌లు అన్నీ కిక్కిరిసి ఉన్నాయి. ఆ ప్రదేశంలో పేరుగాంచిన సాయిబాబా ఆలయానికి భక్తుల రాకపోకలు కొనసాగుతున్నాయి. పలు ప్రదేశాల నుంచి అక్కడకు వెళ్లిన నగరవాసులు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. కానీ ఆ లోపే ఎవ్వరూ ఊహించని దుర్ఘటన చోటుచేసుకుంది. వరుస బాంబు పేలుళ్లతో దిల్‌సుఖ్ నగర్ ఉలిక్కిపడింది. ఒకచోట తేరుకునే లోపే మరోచోట బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ దుర్ఘటనలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు నిరాశ్రయులుగా మిగలగా.. వందలాది మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన జరిగి నేటితో సరిగ్గా ఏడేళ్లు.

ఒకసారి ఆ దారుణాన్ని గుర్తు చేసుకుంటే.. ఆ నెత్తుటి గాయం ఎంతోమంది ఇప్పటికీ పచ్చిగా సలపరిస్తూనే ఉంటుంది. 2013 ఫిబ్రవరి 21న సాయంత్రం గం.6.45ని.లకు దిల్‌సుఖ్‌నగర్‌లో ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ పేలుళ్లలో 17 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మందికి గాయాలయ్యాయి. దీంతో ఈ పేలుళ్లపై మొదట మలక్ పేట, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత 2013 మార్చి 13న కేంద్ర ప్రభుత్వ ఆదేశంతో చర్లపల్లి సెంట్రల్ జైలులో ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ) దర్యాప్తును చేపట్టింది.

ఈ క్రమంలో మూడేళ్లపాటు విచారణ జరిపిన ఎన్‌ఐఎ.. 157 మంది సాక్ష్యాలను రికార్డ్ చేసింది. 502 డాక్యుమెంట్లు, 201 మెటీరియల్‌ను పరిశీలించింది. నిందితులకు వ్యతిరేకంగా పక్కా సాక్ష్యాధారాలు సంపాదించింది. దీంతో కోర్టులో నిందితులకు వ్యతిరేకంగా ఎన్ఐఎ లాయర్లు బలమైన వాదనలు వినిపించారు. అలా.. 2016 నవంబరు 7న ఈ కేసుకు సంబంధించిన వాదనలు పూర్తయ్యాయి. ఇండియన్ ముజాహిదినే ఈ పేలుళ్లకు పాల్పడినట్టు తేలింది. నిందితులుగా ఉన్న అసదుల్లా అఖ్తర్, వకాస్‌, తెహసీన్‌ అఖ్తర్, యాసిన్‌ భత్కల్‌, ఎజాజ్‌ షేక్‌‌లు దోషులని 2016, డిసెంబర్ 13న ఎన్ఐఎ కోర్టు నిర్ధారించింది. అంతేకాదు వారికి ఉరి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. అయితే ఇందులో ప్రధాన నిందితుడైన యాసిన్ భత్కల్ పాకిస్థాన్‌లో తలదాచుకోగా.. మిగిలిన నిందితులు ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నారు.

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!