Congress Won: గ్రేటర్ పరిధి‎లో బీజేపీకి భారీ షాక్.. లింగోజిగూడలో దర్పల్లి రాజశేఖర్ రెడ్డి గెలుపు.. జీహెచ్ఎంసీ 3కు చేరిన కాంగ్రెస్ బలం

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ లో జ‌రిగిన ఏకైక ఉప ఎన్నిక‌లో బీజేపీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం.

Congress Won: గ్రేటర్ పరిధి‎లో బీజేపీకి భారీ షాక్.. లింగోజిగూడలో దర్పల్లి రాజశేఖర్ రెడ్డి గెలుపు.. జీహెచ్ఎంసీ 3కు చేరిన కాంగ్రెస్ బలం
Congress Party
Follow us

|

Updated on: May 03, 2021 | 2:54 PM

Congress Won in Lingojiguda Division: గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ లో జ‌రిగిన ఏకైక ఉప ఎన్నిక‌లో బీజేపీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. గెలిచి, ప్రమాణ‌స్వీకారం చేయ‌క‌ముందే లింగోజీగూడ నుండి గెలుపొందిన బీజేపీ కార్పోరేట‌ర్ ఆకుల రమేష్ గౌడ్ మృతి చెందారు. దీంతో అక్కడ ఉప ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ ఉప ఎన్నిక‌లో బీజేపీ అభ్యర్థికి టీఆర్ఎస్ బ‌హిరంగంగా మ‌ద్దతు తెలిపింది. స్వయంగా కేటీఆర్ మ‌ద్దతిస్తున్నట్లు ప్రక‌టించారు.

ఇదే క్రమంలో ఏప్రిల్ నెల 30వ తేదిన లింగోజిగూడ డివిజన్‎లో ఉప ఎన్నిక జరిగింది. ఇవాళ వెలువడిన ఫలితాల్లో బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి ఆకుల రమేష్ రెడ్డి అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడి నుంచి పోటీ పెట్టొద్దని బీజేపీ నేతల కోరిక మేరకు మంత్రి కేటీఆర్‌ సానుకూలంగా స్పందించారు. దీంతో టీఆర్ఎస్ తరఫున ఎవర్నీ పోటీకి పెట్టలేదు. దీంతో మళ్లీ సిట్టింగ్ సీటు దక్కించుకోవచ్చన్న బీజేపీకి ఊహించని రీతిలో కాంగ్రెస్ షాకిచ్చింది. ఈ గెలుపుతో కాంగ్రెస్‌కు నూతన ఉత్సాహం వచ్చినట్లుయ్యింది.

కాగా.. లింగోజిగూడ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి అభ్యర్థి మందుగుల అఖిల్‌ పవన్‌గౌడ్‌, కాంగ్రెస్‌ నుంచి దర్పల్లి రాజశేఖర్‌ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థులుగా చాలిక చంద్రశేఖర్‌, జల్ల నాగార్జున, షేక్‌ ఫర్వేజ్‌ పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఘన విజయం సాధించారు. సమీప బీజేపీ అభ్యర్థి అఖిల్ పవన్ గౌడ్‌పై 1200కు పైగా మెజార్టీతో రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు. ఈ తాజా విజయంతో బల్దియాలో కాంగ్రెస్ కార్పొరేట్ల బలం మూడుకు చేరింది. అధికార పార్టీ నుంచి అభ్యర్థి బరిలో ఉండుంటే పరిస్థితులు వేరేగా ఉండని ఆ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. కాగా, కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఈ ఎన్నిక జ‌ర‌గ్గా… రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారం కూడా చేశారు. 150 డివిజన్లు ఉన్న కార్పోరేష‌న్‌లో మూడు స్థానాలు రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్న ప‌రిధిలో గెలిచిన‌వే కావడం విశేషం.

Read Also…. Telangana Municipalities Elections Results 2021 LIVE: తెలంగాణలో మినీ పురపోరు ఫలితాలు.. విజేతలు వీరే..!

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..