Secunderabad: డెక్కన్ షోరూంలో నాన్‌స్టాప్‌గా ఎగసిపడుతున్న అగ్నికీలలు.. పక్కబిల్డింగ్‌‌లను చుట్టుముట్టడంతో..

నాన్‌స్టాప్‌గా ఎగసిపడుతున్న మంటల ధాటికి డెక్కన్ షోరూం భవనం ఉనికి ప్రశ్నార్ధకంగా మారింది. అది ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ కూలిపోతే పక్కనే ఉన్న ఇళ్ల పరిస్థితి ఏంటి? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

Secunderabad: డెక్కన్ షోరూంలో నాన్‌స్టాప్‌గా ఎగసిపడుతున్న అగ్నికీలలు.. పక్కబిల్డింగ్‌‌లను చుట్టుముట్టడంతో..
Fire Breaks Out In Deccan Night Wear Store
Follow us

|

Updated on: Jan 19, 2023 | 5:10 PM

సికింద్రాబాద్‌ నల్లగుట్టలో చెలరేగుతున్న మంటలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. రామ్‌గోపాల్‌పేటలోని డెక్కన్‌ నైట్‌వేర్ స్పోర్ట్స్ షోరూంలో ఉదయం 11 గంటల నుంచి ఇప్పటి వరకు మంటలు ఎగసిపడుతున్నాయి. షాపింగ్‌ మాల్‌ పక్కన ఉన్న మరో బిల్డింగ్‌కు కూడా మంటలు అంటుకున్నాయి. మంటలు మరింత విస్తరించే ప్రమాదం ఉందంటున్నారు అధికారులు. మంటల్లో చిక్కుకున్న నలుగురిని ఫైర్‌ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. భవనంలో మరో ఇద్దరు, ముగ్గురు ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయి. స్పాట్‌కు చేరుకున్న 20కి పైగా ఫైర్‌ ఇంజన్లు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. భవనం నుంచి భారీగా శబ్దాలు వస్తున్నాయి. దీంతో ఫైర్‌ సిబ్బంది సైతం బయటకు పరుగులు తీశారు.

మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామంటున్నారు సెంట్రల్‌ జోన్‌ డీసీపీ రాజేష్‌ చంద్ర. భవనంలోకి వెళ్లిన పోలీస్‌ సిబ్బంది కూడా స్వల్ప అస్వస్థతకు గురయ్యారన్నారు డీసీపీ. నిమిష నిమిషానికి మంటలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఫైర్‌ సిబ్బందికి ఇతర శాఖల సిబ్బంది.. అన్ని విధాలుగా సాయం చేస్తున్నారు

ఆ బిల్డింగ్‌లో ఉన్న మెటీరియల్‌ ఏంటి?

ఆరు పైరింజన్లతో ఫైర్‌ సిబ్బంది శ్రమిస్తున్నా మంటలు ఎందుకు అదుపులోకి రావడం లేదు. ఇవే అనుమానాలు ఒంట్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఓ వైపు ఎగసిపడే మంటలు.. అంతకుమించి అనేలా దట్టమైన పొగ.. ఈ రెండింటి మధ్య మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు పైర్ సిబ్బంది చిన్నపాటి యుద్ధమే చేస్తున్నారు. మొత్తం భవనాన్ని చుట్టుముట్టి మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. నాన్‌స్టాప్‌గా వాటర్‌ పైప్‌లతో నీళ్లను ఎగజిమ్ముతున్నారు.

మొత్తం ఆరు అంతస్తుల భవనం.. కిందనున్న ఫ్లోర్‌లో కార్ల విడి భాగాల గోదాం.. ఆ పైన స్పోర్స్ట్ షోరూం. లోపల ఉన్న సరుకు మొత్తం కాలిబూడదవుతుంది. గంటలు గడిచినా మంటలు మాత్రం అదుపులోకి రావడం లేదు. సిట్యువేషన్‌ చూస్తుంటే మంటలు అదుపులోకి రావడానిక మరికొన్ని గంటలు పట్టే అవకాశం కనిపిస్తోంది.

ఫస్ట్‌ ఫ్లోర్‌లో మొదలైన మంటలు

ఉదయం 11 గంటలకు డెక్కన్ షోరూంలోని ఫస్ట్‌ ఫ్లోర్‌లో మంటలు మొదలయ్యాయి. అవి చూస్తుండగానే ఉప్పెనలా బిల్డింగ్‌ మొత్తం వ్యాపించాయి. అప్పటికే చాలామంది ఉద్యోగులు ప్రాణ భయంతో బయటకు పరుగుతీశారు. మరికొంతమందిని ఫైర్ సిబ్బంది సేవ్ చేశారు. మంటలు ఎగసిపడుతున్నాయి. పక్క బిల్డింగ్‌లకు వ్యాపించే ప్రమాదం ఉండటంతో అధికారులు చుట్టుపక్కల వాళ్లందరి ఇళ్లను ఖాళీ చేయించారు. మరికొంతమంది ఇంట్లో ఉన్న సిలిండర్లను బయటకు తీసుకెళ్లారు. మంటలు ఎటువైపు నుంచి ఎటు మళ్లుతాయోనన్న ఆందోళనతో దూరంగా వెళ్లిపోతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం