Hyderabad: మందు బాబు వీరంగం.. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు..

మందుబాబులు రెచ్చిపోతున్నారు. మద్యం తాగి రోడ్లకు మీదికి వచ్చి ఇతరులకు ఇబ్బంది పెడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. హబీబ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మల్లేపల్లి దగ్గర గుర్తుతెలియని వ్యక్తి బీభత్సం సృష్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది..

Hyderabad: మందు బాబు వీరంగం.. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు..
Viral Video
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Narender Vaitla

Updated on: Dec 05, 2024 | 8:45 PM

హైదరాబాద్‌లో మందు బాబులు రెచ్చిపోతున్నారు.. ఫుల్లుగా మద్యం తాగి జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ర్యాష్ డ్రైవింగ్‌తో బెంబేలెత్తిస్తున్నారు. లంగర్‌ హౌస్‌ ఘటన మరవక ముందే హబీబ్‌నగర్‌లో మరో ర్యాష్‌ డ్రైవింగ్ ఘటన నమోదైంది. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేపల్లి దగ్గర గుర్తుతెలియని వ్యక్తి హోండా సిటీ కారులో రాష్ డ్రైవింగ్ చేస్తూ బీభత్సం సృష్టించాడు.

రోడ్డు పక్కన ఆగి ఉన్న వాహనాలను గుద్దుకుంటూ వెళ్లిపోయాడు. మల్లేపల్లి అన్వర్ ఉలూమ్ కళాశాల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. టయోటా వాహనదారుడు ర్యాష్ డ్రైవింగ్​ చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేశాడు. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా నాలుగైదు వాహనాలు ధ్వంసమయ్యాయి. అక్కడున్న ప్రజలు చూస్తుండగానే కారు రివర్స్ తీసుకుని అక్కడి నుంచి ఉడాయించాడు. ​ప్రస్తుతం ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డు కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

హైదరాబాద్‌లో వరుస ఘటనలు జనాలను భయపెడుతున్నాయి. మద్యం మత్తులో డ్రైవ్ చేసి అమాయకుల ప్రాణాలు పొట్టనపెట్టుకుంటున్నారు, డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్టులు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నా మందుబాబుల వైఖరిలో మార్పు రావడం లేదు, దీంతో రాత్రి పూట రోడ్డెక్కాలంటేనే జనాలు భయపడుతున్నారు, ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటే కానీ ఇలాంటి ఘటనలకు చెక్‌ పడవని బాధితులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

'అమ్మానాన్నలు కాబోతున్నామోచ్‌'.. శుభవార్త చెప్పిన కిరణ్ అబ్బవరం
'అమ్మానాన్నలు కాబోతున్నామోచ్‌'.. శుభవార్త చెప్పిన కిరణ్ అబ్బవరం
చికెన్ కొట్టేలోపు బైక్ మాయం.. ఉదయాన్నే షాప్ ఓపెన్ చేస్తుండగా..
చికెన్ కొట్టేలోపు బైక్ మాయం.. ఉదయాన్నే షాప్ ఓపెన్ చేస్తుండగా..
సైఫ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌కు రివార్డు.. ఎంతంటే?
సైఫ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌కు రివార్డు.. ఎంతంటే?
స్టార్ హీరోలతో చేసింది.. ఇప్పుడు ఆఫర్స్ రాక ఇలా..
స్టార్ హీరోలతో చేసింది.. ఇప్పుడు ఆఫర్స్ రాక ఇలా..
నిండు చూలాలి కడుపుపై కూర్చుని.. కాళ్లతో తొక్కి.. ఓ భర్త కిరాతకం
నిండు చూలాలి కడుపుపై కూర్చుని.. కాళ్లతో తొక్కి.. ఓ భర్త కిరాతకం
ప్రేమలు 2 పై క్రేజీ అప్డేట్..
ప్రేమలు 2 పై క్రేజీ అప్డేట్..
పిచ్చుకల కోసం తన ఇంటినే.. ఈ కరీంనగర్ యువకుడిని అభినందించాల్సిందే
పిచ్చుకల కోసం తన ఇంటినే.. ఈ కరీంనగర్ యువకుడిని అభినందించాల్సిందే
ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తున్న మహిళ.. ఆ తర్వాత సీన్ ఇది
ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తున్న మహిళ.. ఆ తర్వాత సీన్ ఇది
'జూనియర్‌ లైన్‌మెన్‌ ఖాళీ పోస్టులను ఆ అభ్యర్థులతోనే భర్తీ చేయండి'
'జూనియర్‌ లైన్‌మెన్‌ ఖాళీ పోస్టులను ఆ అభ్యర్థులతోనే భర్తీ చేయండి'
ఆదివారం మాంసం తింటున్నారా..? ఈ విషయం తెలిస్తే
ఆదివారం మాంసం తింటున్నారా..? ఈ విషయం తెలిస్తే