Hyderabad: హైదరాబాదీలకు అలర్ట్‌.. నేడు నగరంలో నిలిచిపోనున్న MMTS సేవలు.. ఏయే రూట్లలో అంటే..

Hyderabad: నగర నలుమూల నుంచి నడిచే ఎమ్‌ఎమ్‌టీఎస్‌ సేవలకు ఫుల్‌ డిమాండ్‌ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తక్కువ ఖర్చులో ప్రయాణించే వీలు ఉండడంతో నగరవాసులు ఎక్కువగా ఎమ్‌ఎమ్‌టీఎస్‌...

Hyderabad: హైదరాబాదీలకు అలర్ట్‌.. నేడు నగరంలో నిలిచిపోనున్న MMTS సేవలు.. ఏయే రూట్లలో అంటే..
Hyderabad MMTS
Follow us

|

Updated on: Sep 25, 2022 | 9:39 AM

Hyderabad: నగర నలుమూల నుంచి నడిచే ఎమ్‌ఎమ్‌టీఎస్‌ సేవలకు ఫుల్‌ డిమాండ్‌ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తక్కువ ఖర్చులో ప్రయాణించే వీలు ఉండడంతో నగరవాసులు ఎక్కువగా ఎమ్‌ఎమ్‌టీఎస్‌ సేవలను వినియోగించుకుంటుంటారు. ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్‌, ఉద్యోగులు వీటి సేవలపై ఆధారపడుతుంటారు. అయితే కొన్ని రోజుల్లో మెయింటెన్స్‌ అనో, మరో కారణంతోనే ఎమ్‌ఎమ్‌టీఎస్‌ సేవలు నిలిచిపోతుండడం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా వారాంతాల్లో ఎమ్‌ఎమ్‌టీఎస్‌ రైళ్లను ఎక్కువగా రద్దు చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే తాజాగా ఆదివారం (నేడు) నగరంలో వివిధ మార్గాల్లో ఏకంగా 34 రైళ్లను రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మరి ఆదివారం అని చెప్పి ఎమ్‌ఎమ్‌టీఎస్‌ రైళ్లలో వెళ్దామని ప్లాన్‌ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే.. మీ ప్లాన్‌ మార్పులు చేసుకోండి. ఇంతకీ ఏయే రూట్లలో రైళ్లు రద్దు అయ్యాంటే..

* లింగంపల్లి-హైదరాబాద్‌ మధ్య ప్రయాణించే 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140 సేవలను రద్దు చేశారు.

ఇవి కూడా చదవండి

* అలాగే హైదరాబాద్‌-లింగంపల్లి మార్గంలో నడిచే 47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120 నంబరు గల రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

* ఫలక్‌నుమా-లింగంపల్లి మార్గంలో మొత్తం 8 రైళ్లను రద్దు చేశారు. వీటిలో 47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170 నంబర్లు గల రైళ్లు ఉన్నాయి.

* లింగంపల్లి-ఫలక్‌నుమా రూట్‌లో వెళ్లే 47176, 47189, 47187, 47210, 47190, 47191, 47192 నంబరు గల రైళ్లు రద్దయ్యాయి. వీటితోపాటు సికింద్రాబాద్‌-లింగంపల్లి (47150), లింగంపల్లి-సికింద్రాబాద్‌ (47195) కూడా అధికారులు ఆదివారం రద్దు చేశారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..