Hyderabad: జూబ్లీహిల్స్ రేప్ కేసులో ఆరుగురు అరెస్ట్.. సంచలన విషయాలు వెల్లడించిన సీపీ..

Hyderabad: జూబ్లీహిల్స్ రేప్ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించారు పోలీసులు. ఈ కేసులో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు

Hyderabad: జూబ్లీహిల్స్ రేప్ కేసులో ఆరుగురు అరెస్ట్.. సంచలన విషయాలు వెల్లడించిన సీపీ..
Cv
Shiva Prajapati

|

Jun 07, 2022 | 10:52 PM


Hyderabad:జూబ్లీహిల్స్ పబ్ రేప్ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ ఆరుగురిలో ఐదుగురు మైనర్లు కాగా, ఒకరు మేనేజర్ అని తెలిపారు. మైనర్లు కావడం చేత వారి పేర్లను, వివరాలను బయటపెట్టలేమన్నారు. ఈ కేసుకు సంబంధించి సీవీ ఆనంద్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.

అసలేం జరిగింది..
పార్టీ నిర్వహించాలన్న ప్లాన్ గత మార్చిలోనే మొదలైంది. ఏప్రిల్‌లో పార్టీ గురించి ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. మే నెల రెండో వారంలో మళ్లీ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. మే 25న బెంగళూరు నుంచి వచ్చి రూ. లక్ష అడ్వాన్ ఇచ్చారు. ఉస్మాన్ అలీఖాన్ ద్వారా పబ్‌ బుక్ చేసుకున్నారు.

మే 28న ఏం జరిగిందంటే..
నిందితులు ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం పబ్‌లో పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. అదే రోజున బాధితురాలు కూడా రూ. 1300 ఎంట్రీ ఫీజు కట్టింది. మే 28వ తేదీన మధ్యాహ్నం 1.10 గంటలకు బాలిక తన స్నేహితుడితో కలిసి పబ్‌కి వెళ్లింది. కాసేపటికే ఆమె ఫ్రెండ్ పని ఉందని బయటకు వెళ్లాడు. 3 గంటలకు కొందరు అపరిచిత వ్యక్తులు పబ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. బాలికను చూసిన ఆరుగురు నిందితులు ప్లాన్ వేసుకున్నారు. మధ్యాహ్నం 3.15 గంటలకు సాదుద్దీన్ అనే వ్యక్తి బాలికతో అసభ్యంగా మాట్లాడాడు. ఇంతలో బాధితురాలికి తన స్నేహితురాలు కనిపించింది. ఆమె ఉండగానే సాయంత్రం 5.40 వరకూ వేధింపులకు పాల్పడ్డారు. సాయంత్రం 5.40 గంటలకు పబ్ నుంచి బయటకు వచ్చింది బాలిక. తన స్నేహితురాలు వెళ్లిపోయాక ఆ ఆరుగురు నిందితులు బాలికను ట్రాప్ చేశారు. ఆమెను ఏమార్చి సాయంత్రం 5.43 గంటలకు బెంజ్‌కారులో ఎక్కించుకున్నారు. బెంజ్ కారును ఇన్నోవాలో మరో నలుగురు ఫాలో అయ్యారు. రోడ్ నెంబర్ 36 నుంచి రోడ్ నెంబర్ 13లో బేకరీకి పయనం అయ్యారు. మధ్యలోనే నలుగురు నిందితులు బాలికను బలవంతంగా ముద్దాడారు. సాయంత్రం 5.54 గంటలకు బాలిక బెంజ్ కారు నుంచి ఇన్నోవాకు మారింది. అక్కడి నుంచి పెద్దమ్మ గుడి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. గుడి వెనుక ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో బాలికపై నిందితులు ఒకరి తరువాత ఒకరుగా అత్యాచారానికి పాల్పడ్డారు. బాదితురాలిని రాత్రి 7.31 గంటలకు పబ్‌ దగ్గర వదిలి వెళ్లారు. ఆ తరువాత బాధితురాలు తన తండ్రికి ఫోన్ చేసింది. దాంతో అతను వచ్చి బాలికను ఇంటికి తీసుకెళ్లాడు.

కేసు ఆలస్యానికి కారణం..
మే 28న బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు నిందితులు. ఆ క్రమంలో బాలిక మెడ, శరీరంపై గాయాలయ్యాయి. అయితే, ఆ గాయాలను గుర్తించిన బాలిక పేరెంట్స్.. ఏం జరిగిందని ప్రశ్నించారు. 28వ తేదీన ఘటన జరిగితే.. 31 వరకు ఎవరికీ ఈ విషయం చెప్పలేదు బాలిక. 72 గంటల పాటు బాధితురాలు ఘటనను దాచిపెట్టింది. ఎంత అడిగినా తల్లిదండ్రులకూ విషయం చెప్పలేదు. చివరకు మే 31న తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేయడం జరిగింది. 5 గంటల కౌన్సిలింగ్ ఇచ్చిన తరువాత బాలిక నోరు విప్పింది. మొదట తనపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులందరినీ గుర్తించలేకపోయింది బాలిక. ఆ తరువాత ఒక్కొక్కరిని గుర్తించింది. అయితే, ఈ కేసులో వెలుగులోకి వచ్చిన వీడియోలను నిందితులే సర్క్యూలేట్ చేసుకున్నారని సీపీ వెల్లడించారు.

నిందితులు ఎవరంటే..
ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీవీ ఆనంద్ వెల్లడించారు. అయితే, వీరిలో ఏ1 సాదుద్దీన్ మాలిక్ మేజర్ కాగా, మిగతా ఐదుగురు మైనర్లు. వీరిలో ఐదుగురు నిందితులపై 373D గ్యాంగ్ రేప్, ఫోక్సో యాక్ట్, 366 కిడ్నాపింగ్, 366A కిడ్నాపింగ్ మైనర్, ఐటీ యాక్ట్ 67 కింద కేసులు నమోదు చేశాం. మధ్యలోనే కారు దిగి వెళ్లిపోయిన ఆరో వ్యక్తిపై ఐపీసీ 354, 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. వీరికి 20 ఏళ్ల జైలు శిక్ష నుంచి మరణశిక్ష దాకా ఛాన్స్ ఉంది అని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu