Huzurabad Bypoll: గెల్లు శ్రీను గెలుపు కోసం రంగంలోకి దిగిన విద్యార్థి సంఘాలు.. గెలుపే లక్ష్యంగా మకాం వేస్తామంటూ ప్రకటన..

Huzurabad Bypoll: విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గెల్లు శ్రీనివాస్‌ను హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలిపించడం కోసం విద్యార్థి లోకం కధనరంగంలోకి దిగింది.

Huzurabad Bypoll: గెల్లు శ్రీను గెలుపు కోసం రంగంలోకి దిగిన విద్యార్థి సంఘాలు.. గెలుపే లక్ష్యంగా మకాం వేస్తామంటూ ప్రకటన..
Gellu Srinu
Follow us

| Edited By: Phani CH

Updated on: Oct 21, 2021 | 6:21 AM

Huzurabad Bypoll: విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గెల్లు శ్రీనివాస్‌ను హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలిపించడం కోసం విద్యార్థి లోకం కధనరంగంలోకి దిగింది. గెల్లు గెలిచేవరకు అక్కడే మకాం వేస్తామంటూ మూకుమ్మడి ప్రకనట విడుదల చేసింది. ఇదే అంశంపై బుధవారం సాయంత్రం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఓయూ జేఏసీ, టీఎస్ జేఏసీ చైర్మన్ మాందాల భాస్కర్, ఓయూ జేఏసీ అధ్యక్షుడు ఎల్చల దత్తాత్రేయ ఆధార్యంలో విద్యార్థి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వీరు.. తెలంగాణ ఉద్యమంలో తమతో పాటు బరిగీసి కొట్లాడి, జైలు జీవితం గడిపిన విద్యార్థి ఉద్యమ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్‌నే హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక, విద్యా వ్యతిరేక, రైతు వ్యతిరేక చట్టాలను చేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తుందని ఆరోపించారు.

బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై, బడుగు బలహీన వర్గాల ప్రజలపైన దాడులు చేస్తూ పరిపాలించే విధానాన్ని ఖండిస్తున్నామని ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను హుజూరాబాద్ లో భారీ మెజార్టీతో గెలిపించాలని ఓయూ జేఏసీ పిలుపునిస్తుందన్నారు. హుజూరాబాద్‌లో గెల్లు శ్రీను గెలుపే లక్ష్యంగా నేటి నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు పదకొండు యూనివర్శిటీల విద్యార్థి జేఏసీ నాయకులు అక్కడే ఉండి ప్రతి గ్రామం తిరిగి ఓటర్లలను చైతన్యం చేస్తుందని తెలిపారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోరాటాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రాంతీయ పార్టీల వల్లే చిన్న రాష్ర్టాల్లో అభివృద్ధి సాధ్యమని, రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాల్లో అవకాశాలు పెరిగి సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే గేల్లు శీను గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తేల్చి చెప్పారు.

Also read:

Telangana News: ఇదేం పిట్టరా బాబోయ్‌.. హెల్మెట్ ఉంటేనే పెరట్లోకి వెళ్లాలి.. లేదంటే అంతే సంగతి..!

Chandrababu vs YS Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టండి.. రాష్ట్రపతి, ప్రధాని, హోమంత్రికి లేఖ రాసిన చంద్రబాబు..

TDP vs YCP: మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు దీక్ష.. అనుమతి ఇచ్చిన పోలీసులు..

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?