Huzurabad Bypoll: హుజురాబాద్‌లో హీటెక్కిన రాజకీయం.. బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఎవరు రిచ్.? ఎవరు పూర్..?

తెలంగాణ రాజకీయాలు మొత్తం హుజురాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. ఈటల రాజేందర్ రాజీనామాతో అనివార్యమైన హుజూరాబాద్ నియోజకవర్గ ఉప పోరు రసవత్తరంగా మారింది.

Huzurabad Bypoll: హుజురాబాద్‌లో హీటెక్కిన రాజకీయం.. బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఎవరు రిచ్.? ఎవరు పూర్..?
Huzurabad By Election
Follow us

|

Updated on: Oct 14, 2021 | 4:37 PM

Huzurabad Candidates Assets in Affidavit: తెలంగాణ రాజకీయాలు మొత్తం హుజురాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. ఈటల రాజేందర్ రాజీనామాతో అనివార్యమైన హుజూరాబాద్ నియోజకవర్గ ఉప పోరు రసవత్తరంగా మారింది. ఎన్నిక బరిలో 30 మంది అభ్యర్థులు నిలిచారు. అయితే, ప్రధాన పోటీ మాత్రం 3 పార్టీల మధ్యే నెలకొంది. మరి ఆ ముగ్గురిలోనూ ఎవరు రిచ్.? ఎవరికి ఎన్ని ఆస్తులున్నాయి? అప్పుల మాటేంటి? వారు సమర్పించిన అఫిడవిట్‌లో డిటైల్స్ ఉన్నాయి..

మరో 16 రోజుల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. హైవోల్టేజ్ హీట్ రాజేస్తున్న ఈ ఉపయుద్ధాన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ బైపోల్ ఎందుకు వచ్చింది? ఈటల రాజీనామా ఎందుకు చేశారు? ఈ వివాదాలను కాసేపు పక్కన పెడితే ఇప్పుడు అక్కడ గెలుపు ఎవరిదన్నది హాట్‌టాఫిక్‌గా మారింది. అధికార పార్టీ టీఆర్ఎస్‌ నుంచి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్, భారతీయ జనతా పార్టీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు అఫిడవిట్‌లో సమర్పించిన వివరాలు ఓసారి పరిశీలిద్దాం..

అధికార టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన గెల్లు శ్రీనివాస్‌ యాదవ్ మొత్తం ఆస్తుల విలువ రూ. 22 లక్షల 82 వేలు. చరాస్తులు రూ.2 లక్షల 82 వేల 402గా పేర్కొన్నారు. ఆయన ఏడాది సంపాదన రూ. 4 లక్షల 98 వేలు. తన పేరు మీద ఎలాంటి వ్యవసాయ భూమి లేదని భార్య పేరుమీద మాత్రం 12 గుంటల వ్యవసాయ భూమి ఉన్నట్లు వెల్లడించారు గెల్లు శ్రీనివాస్. ఇక తన పేరుమీద 1,210 గజాల స్థలం, రూ.20 లక్షల విలువ చేసే ఇల్లు ఉందని పేర్కొన్నారు. ఎలాంటి అప్పులు లేవని అఫిడవిట్‌లో వెల్లడించారు. తనపైన నమోదైన కేసుల వివరాలును కూడా పొందుపరిచారు. కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను పేర్కొన్నారు.

ఇక, బీజేపీ అభ్యర్థి అయిన మాజీ మంత్రి ఈటల మొత్తం ఆస్తుల విలువ రూ.16 కోట్ల 12 లక్షలు. గత ఆర్థిక సంవత్సరంలో ఆయన వార్షిక సంపాదన 30 లక్షల 16 వేల 592 రూపాయలుగా పేర్కొన్నారు. అదే సమయంలో ఆయన భార్య జమున సంపాదన రూ. కోటి దాటిపోయింది. ఈటల ఎలాంటి బిజినెస్ చేయడం లేదని వెల్లడించారు. వ్యాపారాలన్నీ ఆయన భార్య జమున పేరుమీదే ఉన్నాయి.. జమున హ్యాచరీస్, అభయ డెవలపర్స్, నార్త్ ఈస్ట్ ప్రాజెక్ట్స్, SVS అర్చవాన్ అండ్ డొలరైట్ అనే కంపెనీల్లో పెట్టుబడులున్నాయి. ఈటల పేరు మీద సొంత వాహనం లేదు. కానీ ఆయన భార్య పేరు మీద 3 SUV వెహికిల్స్ ఉన్నాయి. కేజీన్నర గోల్డ్ ఉంది. దీని విలువ రూ. 50 లక్షల పైమాటే. ఈటల జమున మొత్తం ఆస్తులు రూ. 43 కోట్లు. ఇందులో డిపాజిట్లు రూ.28 కోట్ల 68 లక్షలు. స్థిరాస్తులు రూ.14 కోట్ల 78 లక్షలు. ఇక, భార్యాభర్తల పేరుపై రూ.కోట్ల విలువైన భూములున్నాయి. అప్పుల డీటైల్స్ చూస్తే ఈటల పేరుపై రూ.3 కోట్ల 62 లక్షల 42 వేలు కాగా.. జమున పేరుపై రూ.4 కోట్ల 89 లక్షల 77 వేల అప్పు ఉంది.

కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ మొత్తం ఆస్తులు రూ. 59 లక్షల 51 వేలు. ఒక సఫారీ కారు ఉంది. వివిధ రకాల ఆందోళనలు చేపట్టినప్పుడు నమోదైన 8 కేసులు వివిధ దశల్లో విచారణలో ఉన్నాయి. రూ. 15 లక్షల విలువైన స్థిరాస్తులు.. రూ. కోటి 45 లక్షల 2 వందల అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే, తల్లి బల్మూరి పద్మ పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలు కూడా వెల్లడించారు వెంకట్.

అఫిడవిట్లో సమర్పించిన వివరాల ప్రకారం ముగ్గురు ప్రధాన అభ్యర్థుల్లో.. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆస్తుల విలువ ఎక్కువ. సెకండ్ ప్లేస్‌లో బల్మూరి వెంకట్ ఉండగా మూడో స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు.

Read Also…  Sheshikala: పొలిటికల్ రీ ఎంట్రీకి సిద్ధమవుతున్న చిన్నమ్మ.. మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధి నుంచే శుభారంభం

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..