కరెన్సీ డంప్‌ స్వాధీనం..

ఖమ్మం జిల్లా సత్తుపల్లి కేంద్రంగా సాగుతోన్న దొంగ నోట్ల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నకిలీ కరెన్సీని వ్యాప్తి చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. తెలంగాణ ఆంధ్ర సరిహద్దును కేంద్రంగా చేసుకుని పెద్ద ఎత్తున నకీలీ కరెన్సీ  దందాను కొనసాగిస్తున్నట్లుగా తేల్చారు. భారీ ఎత్తున నకిలీ నోట్లతో అక్రమాలకు పాల్పడుతున్న అంతరాష్ర్ట ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గౌరీ గూడెం కు చెందిన షేక్ మదార్ ఈ ముఠాకు  నేత. గత కొంత […]

కరెన్సీ డంప్‌ స్వాధీనం..
Pardhasaradhi Peri

|

Nov 02, 2019 | 8:03 PM

ఖమ్మం జిల్లా సత్తుపల్లి కేంద్రంగా సాగుతోన్న దొంగ నోట్ల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నకిలీ కరెన్సీని వ్యాప్తి చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. తెలంగాణ ఆంధ్ర సరిహద్దును కేంద్రంగా చేసుకుని పెద్ద ఎత్తున నకీలీ కరెన్సీ  దందాను కొనసాగిస్తున్నట్లుగా తేల్చారు. భారీ ఎత్తున నకిలీ నోట్లతో అక్రమాలకు పాల్పడుతున్న అంతరాష్ర్ట ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గౌరీ గూడెం కు చెందిన షేక్ మదార్ ఈ ముఠాకు  నేత. గత కొంత కాలంగా ఈ దొంగ నోట్ల వ్యాపారాన్ని యదేచ్ఛగా కొనసాగిస్తున్నాడు. మరి కొంత మందితో కలిసి దొంగ నోట్ల వ్యాపారాన్ని సాగిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ..మదార్‌ ఇంటిని చుట్టుముట్టారు. ఇంట్లో ఉన్న భారీ ఉన్న దోంగ నోట్ల డంప్‌ను స్వాదీనం చేసుకున్నారు. సుమారు ఏడు కోట్ల రూపాయల విలువ చేసే దొంగ నోట్లను స్వాదీనం చేసుకున్న పోలీసులు అయిదుగిరిని అరెస్టు చేశారు. మరో ఏడుగురు పరారీలో ఉన్నట్లుగా ఖమ్మం నగర పోలీస్‌ కమిషనర్‌ ఇక్బాల్‌ మీడియాకు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…సత్తుపల్లి, వేంసూరు మండలాలు ఆంధ్ర ప్రదేశ్ కు సరిహద్దులో ఉంటాయి. ఈ సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతాలు దందా చేసే వారికి కేంద్రంగా పని చేస్తున్నాయి. సరిహద్దులో ఉండడంతో చేసిన నేరాన్ని తప్పించుకనేందుకు ఈ ప్రాంతాలు అనువుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సత్తుపల్లికి చెందిన  మదార్ మరి కొంత మంది వ్యక్తులు ఇక్కడ ఆసుపత్రి పెడతామని చెబుతూ.. ఒక్క ఇంటిని అద్దెకు తీసుకున్నారు. సత్తుపల్లి ప్రాంతానికి చెందిన మదార్ పాత నేరస్తుడు కూడ. గతంలో కూడ దొంగ నోట్ల కేసులో పట్టు పడ్డాడు. అక్రమ సంపాదనకు అలవాటు పడిన మదార్ మరింతగా సంపాదించేందుకు ఆ ఇంటిని అద్దెకు తీసుకుని.. నకిలీ నోట్ల కట్టలను డంప్ చేశాడు. అయితే ఈ దొంగ నోట్ల తయారీ కేంద్రం ఉంది.. ఇంత పెద్ద మొత్తంలో వచ్చిన నకిలీ నోట్లను ఎలా చెలామణీలో పెడతారు అన్న అంశాలపై విచారణ సాగుతోందన్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu