Rain Alert: తెలంగాణలో భారీ వర్షం.. ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు

అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారి పశ్చిమ మధ్య మరియు దాని సమీపంలోని పరిసర వాయువ్య బంగాళాఖాతం వద్ద కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పాకిస్థాన్ ఈశాన్య అరేబియా సముద్రం మాలేగాన్ , బ్రహ్మపురి జగదల్పూర్, కళింగపట్నం మీదుగా ఆగ్నేయ దిక్కులో కదులుతూ పశ్చిమ మధ్య...

Rain Alert: తెలంగాణలో భారీ వర్షం.. ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు
Rain Alert
Follow us

|

Updated on: Aug 31, 2024 | 6:54 AM

తెలంగాణ ప్రజలను వాతావారణ శాఖ అలర్ట్‌ చేసింది. శనివారం రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో వేగంతో కూడిన ఈదుగు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారి పశ్చిమ మధ్య మరియు దాని సమీపంలోని పరిసర వాయువ్య బంగాళాఖాతం వద్ద కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పాకిస్థాన్ ఈశాన్య అరేబియా సముద్రం మాలేగాన్ , బ్రహ్మపురి జగదల్పూర్, కళింగపట్నం మీదుగా ఆగ్నేయ దిక్కులో కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రాంతం వరకు అల్పపీడన ద్రోణి విస్తరించింది.

ఈ కారణంగా తెలంగాణ లోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరి కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

అలాగే నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, గద్వాల జిల్లాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ 9 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. 13 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుండి 50 కి. మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

విమానంలో లవ్ ప్రపోజల్ | పాత జ్ఞాపకాలతో గల్లీ క్రికెట్.!
విమానంలో లవ్ ప్రపోజల్ | పాత జ్ఞాపకాలతో గల్లీ క్రికెట్.!
మంచు ఫ్యామిలీ మూడో తరం "తిన్నడు".! మంచు అవ్రామ్‌ పోస్టర్‌ లుక్‌..
మంచు ఫ్యామిలీ మూడో తరం
అన్నం వండేవాడు.. మంచిగా ఉండేవాడు.! కోల్‌కతా ఘటన నిందితుడి తల్లి.
అన్నం వండేవాడు.. మంచిగా ఉండేవాడు.! కోల్‌కతా ఘటన నిందితుడి తల్లి.
భారత్‌లో టెలిగ్రామ్‌ యాప్ బ్యాన్.? సెక్షన్ 14C ప్రకారం..
భారత్‌లో టెలిగ్రామ్‌ యాప్ బ్యాన్.? సెక్షన్ 14C ప్రకారం..
రాజమౌళి నా అవసరం లేదన్నారు.! నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..
రాజమౌళి నా అవసరం లేదన్నారు.! నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..
తింటే అరగదు.. వదిలేస్తే ప్రాణం నిలవదు! చిన్నారి ప్రాణం ఖరీదు..
తింటే అరగదు.. వదిలేస్తే ప్రాణం నిలవదు! చిన్నారి ప్రాణం ఖరీదు..
మీ ఆధార్‌ని ఇతరులు వినియోగిస్తున్నారా.? తెలుసుకోండి ఇలా.!
మీ ఆధార్‌ని ఇతరులు వినియోగిస్తున్నారా.? తెలుసుకోండి ఇలా.!
చికెన్‌తో పాటు పెరుగు తింటున్నారా? జాగ్రత్త.. ఇది మీ కోసమే.!
చికెన్‌తో పాటు పెరుగు తింటున్నారా? జాగ్రత్త.. ఇది మీ కోసమే.!
వీళ్లు పుష్పానే మించిపోయారు.. పైకి చూస్తే ఖాళీ లారీ.. లోపల మాత్రం
వీళ్లు పుష్పానే మించిపోయారు.. పైకి చూస్తే ఖాళీ లారీ.. లోపల మాత్రం
హిట్టా.? ఫట్టా.? నాని సరిపోదా శనివారం మూవీకి షాకింగ్ రివ్యూ.!
హిట్టా.? ఫట్టా.? నాని సరిపోదా శనివారం మూవీకి షాకింగ్ రివ్యూ.!