Telangana Weather: తెలంగాణలోని ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్.. వచ్చే 3 గంటలు భారీ వర్షాలు..

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ అలెర్ట్. వచ్చే 3 గంటల పాటు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దు.

Telangana Weather: తెలంగాణలోని ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్.. వచ్చే 3 గంటలు భారీ వర్షాలు..
Telangana Rains
Follow us

|

Updated on: Aug 08, 2022 | 5:00 PM

Telangana Rains: తెలంగాణకు రెడ్‌ అలర్ట్‌.. వచ్చే 3 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా పలు జిల్లాలకు ప్రత్యేక సూచనలు చేసింది వాతావరణ శాఖ. నిర్మల్(Nirmal), నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, రంగారెడ్డి, పెద్దపల్లి, హైదరాబాద్(Hyderabad), మేడ్చల్, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణ్ పేట్, వనపర్తి, గద్వాల్, నాగర్‌కర్నూల్, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో ఉరుములు, మెరపులతో భారీ వర్షాలు నమోదయ్యే చాన్స్ ఉందని వెల్లడించింది.  గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో ఓ మోస్తారు వానలు ఉండొచ్చని పేర్కొంది. ప్రజలంతా అలెర్ట్‌గా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. పలు చోట్ల ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌ను అయితే నల్లటి మేఘాలు కమ్మేశాయి. విడతల వారీగా పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది.

  • భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో పొంగిపొర్లుతోన్న వాగులు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఖమ్మం జిల్లా లోని వైరా రిజర్వాయర్ అలుగు లపై వరదనీరు ప్రవహిస్తోంది. స్నానాల లక్ష్మీపురం, సిరిపురం గ్రామాల మధ్య బ్రిడ్జి పై పొంగుతున్న వరదనీరు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఈ రెండు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
  • ఇక ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం మల్లు పల్లి వద్ద వాగులూ, వంకల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పరిసర గ్రామాలతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.అటు కొమురం భీం జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాలకు ఊరు, ఏరు ఏకమౌతున్నాయి. భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న వాగులు జనాన్ని హడలెత్తిస్తున్నాయి.
  • రాష్ట్రంలో మూడు రోజుల నుంచి రికాం లేకుండా వానలు కురుస్తున్నాయి. ముసురు వదలడం లేదు. జనజీవనం అతలాకుతలమవుతోంది.ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పొన్నెకల్ వద్ద లింగాల-డోరృకల్ రహదారిపై బుగ్గ వాగు ఉధృతంగా ప్రహహిస్తోంది..దీంతో ఖమ్మం-డోర్నకల్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి..పలుచోట్లు ఇండ్లల్లోకి వరద నీళ్లు వచ్చి జనం తిప్పలు పడుతున్నారు.
  • కొమురం భీమ్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామం వద్ద దిందా వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో దిందా గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. బెజ్జూర్ మండలం సుస్మిర్ ఒర్రె ఉధృతంగా ప్రవహిస్తోంది..దీంతో ఆరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏరుదాటే దారి లేక జనం ఇలా అవస్తలు పడుతున్నారు.
  • వరద పోటెత్తడంతో కొమురం భీమ్ ప్రాజెక్ట్‌కు ముప్పు పొంచివుంది. భారీ వర్షాలకు ప్రాజెక్ట్ కట్టకు పగుళ్లేర్పడ్డాయి. పారాఫీట్ వాల్, ఆనకట్ట నుంచి వాటర్ లీక్ అవుతోంది. వరద ఉధృతికి ఆనకట్ట మట్టి కొట్టుకుపోతోంది. బండరాళ్లు ప్రాజెక్టులోకి పడిపోతుండటంతో భయాందోళనలో ఉన్నారు దిగువ గ్రామాల ప్రజలు. జలపాతాలు పొంగిపొర్లుతూ జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి