హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో కుండ‌పోత‌గా వ‌ర్షం..

హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపుల‌తో పాటు బ‌ల‌మైన ఈదురు‌ గాలులు కూడా వీస్తున్నాయి. గ‌త రెండు గంట‌ల సేపు నుంచి ఒకే విధంగా దంచికొడుతుంది వ‌ర్షం. ఇంత భారీ వ‌ర్షం పడుతున్నా కూడా....

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో కుండ‌పోత‌గా వ‌ర్షం..

హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపుల‌తో పాటు బ‌ల‌మైన ఈదురు‌ గాలులు కూడా వీస్తున్నాయి. గ‌త రెండు గంట‌ల సేపు నుంచి ఒకే విధంగా దంచికొడుతుంది వ‌ర్షం. ఇంత భారీ వ‌ర్షం పడుతున్నా కూడా.. సిటీ ప్ర‌జ‌లు ఉక్క‌పోత‌కు గుర‌వుతున్నారు. కాగా భారీ వ‌ర్షంతో ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షపు నీరు నిలిచిపోయింది. అలానే కొన్ని చోట్ల విద్యుత్‌కి అంత‌రాయం ఏర్ప‌డింది. అమీర్ పేట్‌, పంజాగుట్ట‌, బంజారాహిల్స్, జూబ్లీహిట్స్, సోమాజిగూడ‌, అబిడ్స్, దిల్‌సుఖ్ న‌గ‌ర్, కోఠి, కుత్బుల్లాపూర్‌, ఎల్బీన‌గ‌ర్‌, తార్నాక‌, ఉప్ప‌ల్‌, సికింద్రాబాద్‌, బోయిన్ ప‌ల్లి, తిరుమ‌ల‌గిరి, మారేడ్ ప‌ల్లి, బేగంపేట‌, ఖైర‌తాబాద్, కూక‌ట్ ప‌ల్లి, మియాపూర్‌ల‌లో భారీ వ‌ర్షం కురిసింది. కాగా గ‌త కొద్ది రోజులుగా తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తోన్న సంగ‌తి తెలిసింది.

Read More:

విశాఖ ‘షిప్ యార్డు ప్ర‌మాద ఘ‌ట‌న’‌పై సీఎం జ‌గ‌న్ ఆరా..

‘ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ లోగో’ త‌యారు చేయండి.. రూ.25 వేలు గెలుపొందండి!

ఇక‌పై ప్ర‌భుత్వ ఉద్యోగులు టీ ష‌ర్ట్స్‌, జీన్స్ ధ‌రించ‌డం నిషేధం

Click on your DTH Provider to Add TV9 Telugu