హైదరాబాద్‌కు మూడు రోజుల పాటు భారీ వ‌ర్ష సూచ‌న‌

హైదరాబాద్‌కు మూడు రోజుల పాటు భారీ వ‌ర్ష సూచ‌న‌

రానున్న రెండు, మూడు రోజుల్లో హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షాలు ప‌డ‌వ‌చ్చున‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరించింది. వాయువ్య రుతు ప‌వ‌నాల కార‌ణంగా ఓ మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు ప‌డే సూచ‌న‌లు ఉన్నాయ‌ని తెలిపింది. వ‌చ్చే మూడు రోజులు కూడా భారీ ఈదురు గాలులు, ఉరుములు..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 03, 2020 | 2:06 PM

రానున్న రెండు, మూడు రోజుల్లో హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షాలు ప‌డ‌వ‌చ్చున‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరించింది. వాయువ్య రుతు ప‌వ‌నాల కార‌ణంగా ఓ మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు ప‌డే సూచ‌న‌లు ఉన్నాయ‌ని తెలిపింది. వ‌చ్చే మూడు రోజులు కూడా భారీ ఈదురు గాలులు, ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు ప‌డే అవ‌కాశమున్న‌ట్లు భార‌త వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. కాగా శ‌ని, ఆదివారాల్లో హైద‌రాబాద్ న‌గ‌రంలో భారీ వ‌ర్ష‌పాతం న‌మోదైంది. శ‌నివారం బండ్ల‌గూడ‌లో అత్య‌ధికంగా 103.8 మిల్లీ మీట‌ర్లు, ఎల్బీన‌గ‌ర్‌లో 94.5 మిల్లీ మీట‌ర్ల వ‌ర్ష పాతం ప‌డిందని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

ఇక‌ గ‌త 24 గంట‌ల్లో హైద‌ర్ న‌గ‌ర్, వ‌న‌స్థ‌లి పురం, నాగోల్, అఫీస్ పేట్, కేపీహెచ్‌బీ ప్రాంతంలో 60 నుంచి 90 మిల్లీ మీట‌ర్ల మేర వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్టు తెలంగాణ స్టేట్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ తెలిపింది. నిన్న మియాపూర్, ఆర్‌సీ పురం, సుభాష్ న‌గ‌ర్‌, బండ్ల‌గూడ‌, నాగోల్‌లో 13 మిల్లీ మీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంది. కాగా గ‌త కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ‌ర్షాలు ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే.

Read More:

మంత్రి కేటీఆర్‌కు రాఖీ క‌ట్టిన క‌విత‌

సోద‌రీమ‌ణులంద‌రికీ రాఖీ పండుగ‌ శుభాకాంక్ష‌లుః సీఎం జ‌గ‌న్

ప్ర‌పంచంపై క‌రోనా టెర్ర‌ర్.. ఉధృతంగా పెరుగుతోన్న పాజిటివ్ కేసులు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu