Krishna Projects: తెలుగు రాష్ట్రాల్లో పరవళ్లు తొక్కుతున్న కృష్ణానది.. నిండుకుండల్లా ప్రాజెక్టులు..

Krishna Projects: కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. వరద నీరు పోటెత్తడంతో కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతోంది. ఇన్‌ఫ్లో అంతకంతకూ పెరుగుతుండటంతో కృష్ణా రివర్‌ ఉధృతంగా..

Krishna Projects: తెలుగు రాష్ట్రాల్లో పరవళ్లు తొక్కుతున్న కృష్ణానది.. నిండుకుండల్లా ప్రాజెక్టులు..
Krishna Water
Follow us

|

Updated on: Aug 10, 2022 | 9:43 AM

Krishna Projects: కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. వరద నీరు పోటెత్తడంతో కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతోంది. ఇన్‌ఫ్లో అంతకంతకూ పెరుగుతుండటంతో కృష్ణా రివర్‌ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలకు కృష్ణా ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారుతున్నాయ్‌. అసలు, ఏ ప్రాజెక్టులో ఎంత నీటి మట్టం ఉంది? ఇన్‌ఫ్లో ఎంతుంది? ఔట్‌ఫ్లో ఎంతుంది?

జురాలకు ముందుండే, నారాయణపూర్‌ ప్రాజెక్ట్‌లో నీటిమట్టం దాదాపు పూర్తిస్థాయికి చేరింది. రిజర్వాయర్ కెపాసిటీ 1615 అడుగులు కాగా, ఆల్రెడీ 1612 అడుగులకు నీటిమట్టం చేరింది. 37 టీఎంసీలకు ఆల్రెడీ 35 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నారాయణపూర్‌ ఇన్‌ఫ్లో లక్షా 35వేల క్యూసెక్కులు ఉండే, ఔట్‌ఫ్లో లక్షా 42వేల క్యూసెక్కులుగా కొనసాగుతోంది.

జురాల ప్రాజెక్టులోనూ ఇదే పరిస్థితి. డ్యామ్‌ కెపాసిటీ 1045 అడుగులు కాగా ఆల్రెడీ 1042 అడుగులకు నీటిమట్టం చేరింది. 9.66 టీఎంసీలకు 8.79 టీఎంసీల నీటినిల్వ కొనసాగుతోంది. ఇక, ఇన్‌ఫ్లో 58వేల క్యూసెక్కులు… ఔట్‌ఫ్లో 73వేల క్యూసెక్కులుగా ఉంది జురాలలో…

తుంగభద్ర ప్రాజెక్టు అయితే నిండుకుండలా మారింది. 1633 అడుగులకు 1632 అడుగుల నీటిమట్టం ఉందక్కడ. నీటినిల్వ సామర్ధ్యం 105.79 టీఎంసీలు కాగా ప్రజెంట్‌ 101.77 టీఎంసీలకు చేరుకుంది. ఇన్‌ఫ్లో లక్షా 38వేల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో లక్షా 59వేల క్యూసెక్కులుగా కొనసాగుతోంది.

శ్రీశైలం రిజర్వాయర్‌ కంప్లీట్‌గా నిండిపోయింది. ప్రాజెక్ట్‌ సామర్ధ్యం 885 అడుగులు కాగా నీటిమట్టం 884.8 అడుగులకు చేరింది. 215.81 టీఎంసీలకు 214.36 టీఎంసీలకు చేరుకుంది. ఇక, ఇన్‌ఫ్లో లక్షా 90వేల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 2లక్షల 19వేల క్యూసెక్కులుగా ఉందిక్కడ.

నాగార్జునసాగర్‌లోనూ నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. ప్రాజెక్ట్‌ సామర్ధ్యం 590 అడుగులు కాగా, ప్రజెంట్‌ 576.3 అడుగులకు చేరింది నీటిమట్టం. 312.05 టీఎంసీలకు ప్రస్తుతం 272.44 టీఎంసీలు నీటి నిల్వ కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో లక్షా 84వేల క్యూసెక్కులు ఉంటే, దిగువకు 32వేల క్యూసెక్కులను వదులుతున్నారు.

పులిచింతల ప్రాజెక్టుకు సైతం వరద నీరు పోటెత్తుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులుగా ఉంటే ప్రస్తుతం 171 అడుగులకు చేరుకుంది. 45.77 టీఎంసీలకు 40.53 టీఎంసీల నీటినిల్వ ఉందిక్కడ. ఇక, ఇన్‌ఫ్లో 39వేల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 51వేల క్యూసెక్కులుగా కొనసాగుతోంది.

ప్రకాశం బ్యారేజీ అయితే నిండుకుండలా మారింది. నీటిమట్టం, నీటినిల్వ రెండూ కూడా పూర్తిస్థాయికి చేరుకున్నాయ్‌. 57 అడుగులకు 57 అడుగులు, 3.07 టీఎంసీలకు 3.07 టీఎంసీల వాటర్‌ ఉందిక్కడ. ఇన్‌ఫ్లో లక్షా 2వేల క్యూసెక్కులు ఉంటే అంతే నీటిని సముద్రంలోకి వదులుతున్నారు అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు..!
ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు..!
సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె..
సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె..
ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది
ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!