తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. రేపటి నుంచి హాఫ్ డే స్కూల్స్.. వివరాలివే!

వేసవి కాలం వచ్చేసింది. రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపధ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. రేపటి నుంచి హాఫ్ డే స్కూల్స్.. వివరాలివే!
Bhagavad Gita in Schools
Follow us

| Edited By: Srinivas Chekkilla

Updated on: Mar 14, 2022 | 2:42 PM

వేసవి కాలం వచ్చేసింది. రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి అనగా మార్చి 15వ తేదీ నుంచి ఉదయం 8 నుంచి మ. 12.30 వరకు హాఫ్ డే స్కూల్స్ నిర్వహించనున్నట్లు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీ సంవత్సరం లాగానే ఈ సంవత్సరం మార్చి 15 నుంచి ఒంటి బడి నిర్వహించనున్నారు.

అయితే కరోనా వల్ల ఈ ఏడాది ప్రత్యక్ష తరగతులు కొంత ఆలస్యంగా (సెప్టెంబరు 1వ తేదీ నుంచి) ప్రారంభమయ్యాయి. సంక్రాంతి పండుగ సమయంలో కరోనా తీవ్రత మళ్లీ పెరగడంతో 24 రోజుల సెలవులు ఇచ్చారు. తరగతులు తక్కువగా నిర్వహించడంతో ఈ ఏడాది 70 శాతం సిలబస్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని రేపటి నుంచి రాష్ట్రంలో ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షలు మే 11వ తేదీన ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలు మే 20వ తేదీన ముగియనున్నాయి. దీంతో ఈ ఏడాది అకాడమిక్‌ సంవత్సరం మే 20న ముగుస్తుందని అధికారులు చెబుతున్నారు. కాగా, రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఏప్రిల్‌ 22వ తేదీన ప్రారంభమై మే 12వ తేదీన ముగుస్తున్న విషయం తెలిసిందే.

Read Also.. Singareni: సింగరేణిలో మోగిన సమ్మె సైరన్‌.. ప్రైవేటీకరణకు వ్యతిరేఖంగా కార్మికుల ఆందోళన..