Govt of India vs Telangana Govt: మేం అలా అనలేదు.. యాసంగిలో వరి వేయడంపై కేంద్రం కీలక వ్యాఖ్యలు..

Govt of India vs Telangana Govt: తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో వరి వేయొద్దని తాము చెప్పలేని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

Govt of India vs Telangana Govt: మేం అలా అనలేదు.. యాసంగిలో వరి వేయడంపై కేంద్రం కీలక వ్యాఖ్యలు..
Telangana Govt
Follow us

| Edited By: Rajeev Rayala

Updated on: Nov 27, 2021 | 8:39 AM

Govt of India vs Telangana Govt: తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో వరి వేయొద్దని తాము చెప్పలేని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. పంట మార్పిడి చేసుకోవాలని మాత్రమే సూచించామన్నారు. ఖరీఫ్ సీజన్‌లో ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయకుండా.. పరిమితి ఎలా పెంచమంటారు? అంటూ తెలంగాణ ప్రభుత్వ వైఖరిని కేంద్ర ప్రశ్నించింది. తెలంగాణలో ధాన్యం కొనుగోలు ఆలస్యంగా జరుగుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆరోపించాయి. టార్గెట్ చెప్పమని పట్టుబడుతున్నారని, ఏడాది టార్గెట్ ముందుగానే చెప్పడం సాధ్యం కాదని స్పష్టం చేసింది కేంద్రం. దేశంలోని పంటల పరిస్థితుల ఆధారంగా నిర్ణయం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. వ్యవసాయ శాఖతో పాటు అనేక శాఖలు.. దీనిపై అంచనాలు రూపొందించాల్సి ఉంటుందన్నారు. ముందే అంతా సులభంగా చెప్పలేమని కేంద్ర వర్గాలు పేర్కొన్నాయి.

తెలంగాణ మంత్రి ఇలా.. వరి కొనుగోళ్లపై తెలంగాణకు కేంద్రం మొండి చేయి చూపిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తాము ఎంతో ఆశతో కేంద్రమంత్రితో సమావేశానికి వచ్చామని అన్నారు. శుక్రవారం రాత్రి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన నిరంజన్ రెడ్డి.. ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం తమను నిరాశపరిచిందన్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాలేదన్నారు. గోయల్‌తో భేటీ నిరాశపరిచిందని వ్యాఖ్యానించారు. యాసంగిలో వరి వేయొద్దని కేంద్రం చెబుతోందని, తాము కూడా రైతులకు అదే చెప్పామని రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇంకా ధాన్యం కొనుగోళ్లకు నిరాకరించిన కేంద్రం.. కోటా పెంపుపైనా స్పష్టత ఇవ్వలేదన్నారు. కానీ, తెలంగాణ బీజేపీ నాయకులు మాత్రం రైతులకు వరి వేయాలని చెబుతున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

Also read:

గ్యాస్‌ సమస్య తరచూ వేధిస్తోందా.. నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదమో తెలుసా..?

Rainfall: దక్షిణ భారతదేశంలో వర్షాల బీభత్సం.. ఒక్క నవంబర్‌లోనే 143.4 శాతం వానలు..

Corona Effect: వారి కుటుంబాల పునరావసం కోసం దాఖలైన పిటిషన్ పై కేంద్ర స్పందన కోరిన సుప్రీం కోర్టు

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.