Telangana: ఆయనో ప్రభుత్వ వైద్యుడు.. మంచి పేరు కూడా ఉంది.. కట్ చేస్తే అక్కడ అడ్డంగా బుక్కయ్యాడు..

Telangana: ఆయనో ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌. వైట్‌ కాలర్‌ జాబ్‌. రోగులపాలిట దేవుడిగానూ పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. భారీ వేతనం కూడా వస్తోంది.

Telangana: ఆయనో ప్రభుత్వ వైద్యుడు.. మంచి పేరు కూడా ఉంది.. కట్ చేస్తే అక్కడ అడ్డంగా బుక్కయ్యాడు..
Private Clinic
Follow us

|

Updated on: Sep 24, 2022 | 3:40 PM

Telangana: ఆయనో ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌. వైట్‌ కాలర్‌ జాబ్‌. రోగులపాలిట దేవుడిగానూ పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. భారీ వేతనం కూడా వస్తోంది. సమాజంలో ఉన్నత హోదా ఆయన సొంతం. అయినా ఇవేమీ ఆ డాక్టర్‌కు సరిపోలేదేమో. డబ్బు కోసం తహతహలాడుతూ.. డబ్బు మనిషిగా మారాడు. అవును.. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌గా సేవలందిస్తూనే.. ప్రైవేటు క్లినిక్‌ నడుపుతూ కోట్లు సంపాదిస్తున్నాడు. ఉన్నతాధికారుల ఆకస్మిక తనిఖీల్లో ఆ వైద్యుడి బండారం బయటపడింది. ప్రైవేటు క్లినిక్‌లో వైద్యసేవలందిస్తున్న డాక్టర్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇంతకీ ఎవరా వైద్యుడు? ఎక్కడ జరిగిందిది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

సూర్యాపేట జిల్లా కేంద్రంలో వైద్యశాఖ ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. కేతెపల్లి పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న విజయ్‌ సూర్యాపేటలో క్లినిక్‌ నడుపుతున్నట్లు గుర్తించారు. ఒక్కసారిగా దాడి చేశారు. విజయ్‌.. పేషంట్లను పరీక్షిస్తుండగానే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న సాయిగణేశ్‌ క్లినిక్‌ను సీజ్‌ చేశారు. ఇదే కోణంలో మరికొన్న ఆసుపత్రులకు కూడా షోకాజ్‌ నోటీసులు జారీచేశారు అధికారులు. ఇక రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన విజయ్‌పై విచారణ ముమ్మరం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..