Telangana: ఆ జిల్లాల్లోని గర్భిణులకు గుడ్ న్యూస్.. త్వరలోనే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ..

మంత్రి హరీశ్ రావు శనివారం కామారెడ్డి జిల్లాని బిచ్‌కుందలో డయాలిసిస్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కిడ్నీ సమస్యలు ఉన్న వారు వారానికి రెండు మూడు సార్లు డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు.

Telangana: ఆ జిల్లాల్లోని గర్భిణులకు గుడ్ న్యూస్.. త్వరలోనే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ..
Minister Harish Rao
Follow us

|

Updated on: Dec 03, 2022 | 2:52 PM

తెలంగాణ ప్రభుత్వం గర్భిణులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారం, పది రోజుల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ ప్రారంభించనున్నట్లు ఆర్థిక, వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు వెల్లడించారు. కామారెడ్డి సహా 9 జిల్లాల్లో.. 1.24 లక్షల మంది గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ అందజేయనున్నట్లు తెలిపారు. బిడ్డ పుట్టిన తర్వాత కేసీఆర్ కిట్స్, పుట్టక ముందు న్యూట్రిషన్ కిట్ పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. మంత్రి హరీశ్ రావు శనివారం కామారెడ్డి జిల్లాని బిచ్‌కుందలో డయాలిసిస్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కిడ్నీ సమస్యలు ఉన్న వారు వారానికి రెండు మూడు సార్లు డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. పేదవారికి ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కేవలం ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆసుపత్రుల్లో మాత్రమే ఈ సౌకర్యం ఉండేదన్నారు. ఆదిలాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం లాంటి సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి ప్రయాణం చేయాల్సి వచ్చేదని తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారంగా.. డయాలసిస్ కేంద్రాల సంఖ్యను తెలంగాణ ప్రభుత్వం 3 నుంచి 83 కు పెంచిందని మంత్రి హరీష్‌ రావు తెలిపారు. ఈ సంఖ్యను 102 కు పెంచాలన్న లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం.. యుద్ధ ప్రాతిపాదికన డయాలసిస్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీ ద్వారా సింగిల్ యూజుడ్ ఫిల్టర్‌ను ఉపయోగించి డయాలసిస్ చేస్తున్నామని హరీశ్‌ రావు తెలిపారు. ఒకరి నుంచి మరొకరికి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

డయాలసిస్‌ రోగులకు ఆసరా పింఛను, ఉచిత బస్‌ పాస్‌ కూడా ఇస్తున్నామని తెలిపారు. ఏటా 150 వరకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లు జరుగుతున్నాయని ఈ సందర్భంగా హరీశ్‌ రావు తెలిపారు. ట్రాన్స్‌ప్లాంటేషన్‌ తర్వాత అవసరమయ్యే మందులను కూడా ఉచితంగా జీవిత కాలంపాటు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో దాదాపు 12వేల మంది డయాలసిస్‌ చేయించుకుంటున్నారు, వారిలో 10వేల మందికి ఉచితంగా ప్రభుత్వం డయాలసిస్‌ చేయిస్తోందన్నారు. డయాలసిస్‌ రోగులకు పింఛను ఇస్తున్నామని.. కిడ్నీ రోగులకోసం ఏడాదికి రూ.100 కోట్లు ఖర్చు చేసున్నామని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత సుమారు రూ.700 కోట్లు కిడ్నీ రోగులకోసం ఖర్చు చేశామని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన నాటినుంచి ఇప్పటివరకు 49.8 లక్షల డయాలిసిస్ సెషన్స్ చేయడం జరిగిందని.. వచ్చే వారంలో 50 లక్షల సెషన్లు పూర్తి అవుతాయన్నారు. దేశంలోనే ఇది గొప్ప విషయమని తెలిపారు.

బిడ్డ క‌డుపులో పడినప్పుడు గర్భిణులకు న్యూట్రీష‌న్ కిట్‌, డెలివ‌రీ అయిన త‌ర్వాత కేసీఆర్ కిట్ అందజేయనున్నట్లు హరీశ్‌ రావు తెలిపారు. కేసీఆర్ కిట్ విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చిందని.. ఇదే స్ఫూర్తితో మ‌హిళ‌ల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ న్యూట్రీష‌న్ కిట్ తీసుకురాబోతున్నారని తెలిపారు. అత్యధిక ఎనీమియా ప్రభావం ఉన్న 9 జిల్లాలు ఆదిలాబాద్‌, భ‌ద్రాద్రి కొత్తగూడెం, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, జోగులాంబ గ‌ద్వాల్‌, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ములుగు, నాగ‌ర్ క‌ర్నూల్‌, వికారాబాద్‌ల‌లో ఈ కిట్‌ పంపిణీ చేయడం జ‌రుగుతుందని తెలిపారు. మొత్తం 1.24 లక్షల మంది గ‌ర్భిణుల‌కు ఇది ఉప‌యోగ‌ప‌డుతుందని తెలిపారు. ప్రోటీన్స్‌, మిన‌ర‌ల్స్‌, విట‌మిన్స్ ల‌ను పోష‌కాహారం ద్వారా అందించి ర‌క్త హీన‌త త‌గ్గించ‌డం, హీమోగ్లోబిన్ శాతం పెంచ‌డం దీని ల‌క్ష్యమని హరీశ్‌ రావు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..