కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మృతి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి ఈ రోజు ఉదయం కన్నుమూశారు. గతంలో ఇక్కడి నుండే ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. ఇక స్వతంత్ర అభ్యర్థిగా ఒకసారి, కాంగ్రెస్ పార్టీ తరపున మరోసారి ఎడ్మ కిష్టారెడ్డి ఎమ్మెల్యేగా...

  • Publish Date - 2:03 pm, Tue, 18 August 20 Edited By:
కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మృతి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి ఈ రోజు ఉదయం కన్నుమూశారు. గతంలో ఇక్కడి నుండే ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. ఇక స్వతంత్ర అభ్యర్థిగా ఒకసారి, కాంగ్రెస్ పార్టీ తరపున మరోసారి ఎడ్మ కిష్టారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంతేకాకుండా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి.. అత్యంత సన్నిహితుడుగా కిష్టారెడ్డికి పేరుంది. అలాగే మాజీ కేంద్రం మంత్రి జైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. సర్పంచ్గా, మండల పరిషత్ అధ్యక్షుడిగా కూడా ఆయన పని చేశాడు. తెలంగాణ రాక ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎడ్మ కిష్టారెడ్డి కీలకంగా పని చేశారు. 2018 ఎన్నికల ముందు ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాగా ఎడ్మ కిష్టారెడ్డి మృతికి పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటిస్తున్నారు.

Read More:

మధ్యప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం.. వారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు

ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిని హడలెత్తిస్తున్న కరోనా

హైదరాబాద్ టూ యూకే విమాన సర్వీసులు స్టార్ట్