మహబూబ్‌నగర్ కోల్డ్ స్టోరేజీలో అగ్నిప్రమాదం.. రూ. 20 కోట్ల నష్టం..

మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కనకదుర్గా కోల్డ్ స్టోరేజీలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఎనిమిది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఎగిసిపడుతున్న మంటల ధాటికి కోల్డ్ స్టోరేజీలోని ఏ,బీ బ్లాకులు పూర్తిగా దగ్దమయ్యాయి. సుమారు 9 గంటలుగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల ధాటికి కోల్డ్ స్టోరేజీలో భద్రపరిచిన మిర్చి, కందులు, చింతపండుతో మరిన్ని పంటల ఉత్పత్తులు కాలిపోయినట్లు తెలుస్తోంది. ఓ వైపు మంటల వేడి.. మరో వైపు మిర్చి ఘాటుతో సిబ్బంది […]

మహబూబ్‌నగర్ కోల్డ్ స్టోరేజీలో అగ్నిప్రమాదం.. రూ. 20 కోట్ల నష్టం..
Follow us

| Edited By:

Updated on: Jul 25, 2019 | 8:42 AM

మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కనకదుర్గా కోల్డ్ స్టోరేజీలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఎనిమిది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఎగిసిపడుతున్న మంటల ధాటికి కోల్డ్ స్టోరేజీలోని ఏ,బీ బ్లాకులు పూర్తిగా దగ్దమయ్యాయి. సుమారు 9 గంటలుగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల ధాటికి కోల్డ్ స్టోరేజీలో భద్రపరిచిన మిర్చి, కందులు, చింతపండుతో మరిన్ని పంటల ఉత్పత్తులు కాలిపోయినట్లు తెలుస్తోంది. ఓ వైపు మంటల వేడి.. మరో వైపు మిర్చి ఘాటుతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. కాగా ప్రమాదంలో సుమారు 20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.